VVS Laxman Son: వీవీఎస్ వారసుడు వచ్చేస్తున్నాడు..! రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టిన సర్వజిత్

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. సికింద్రాబాద్ నవాబ్స్ జట్టు తరపున తన కెరీర్‌లో రెండో మ్యాచ్ ఆడిన సర్వజిత్ సెంచరీ కొట్టాడు.

VVS Laxman Son: వీవీఎస్ వారసుడు వచ్చేస్తున్నాడు..! రెండో మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టిన సర్వజిత్

Sarvajit Laxman

Updated On : June 29, 2023 / 10:23 AM IST

Sarvajit Laxman Century: టీమిండియా మాజీ క్రికెటర్ల వారసులు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వారు అనేక మందే ఉన్నారు. ఇటీవల సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ -2023లో ముంబయి జట్టు తరపున పలు మ్యాచ్‌లుసైతం ఆడిన విషయం తెలిసిందే. తాజాగా, మరో మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీ లక్ష్మణ్ వారసుడు సర్వజిత్ క్రికెట్ ఆటలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌లలో అతను తన తొలి సీజన్‌ను ఘనంగా మొదలు పెట్టాడు. రెండు రోజుల లీగ్‌లో భాగంగా సికింద్రాబాద్ నవాబ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వజిత్ తన రెండో మ్యాచ్‌లోనే లెఫ్ట్ హ్యాడ్‌తో సెంచరీ చేశాడు.

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్‌కు మద్దతుగా బ్రెట్ లీ.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్

ఈ మ్యాచ్‌లో సర్వజిత్ 209 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, పన్నెండు ఫోర్లు ఉన్నాయి. ప్యూచర్ స్టార్ వర్సెస్ సికింద్రాబాద్ నవాబ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన ప్యూచర్ స్టార్ జట్టు 427 పరుగులు చేసింది. సికింద్రాబాద్ నవాబ్స్ జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, సర్వజిత్ అద్భుత పోరాటంతో నవాబ్స్ జట్టు ఆ మాత్రం స్కోర్ సాధించింది. అయితే, వీవీఎస్ లక్ష్మణ్ కుమారుడు సర్వజిత్ రెండో మ్యాచ్ లోనే సెంచరీ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

Sachin Tendulkar: కొత్త ల‌గ్జ‌రీ కారు కొన్న స‌చిన్ టెండూల్క‌ర్‌.. వామ్మో అన్ని కోట్లా

సర్వజిత్ తన మొదటి మ్యాచ్‌లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. రెండో మ్యాచ్‌లో అద్భుత ఆటతీరును కనబర్చడం ద్వారా ప్రశంసలు అందుకున్నాడు. సెంచరీ చేయడంపై సర్వజిత్ మాట్లాడుతూ.. ఇది నాకు రెండవ మ్యాచ్ మాత్రమే. తొలి సెంచరీ ఎప్పుడూ చిరస్మరణీయమైనది. ఎందుకంటే నేనే ఈ స్థాయిలో పరుగులు చేయగలననే విశ్వాసాన్ని అది నాకు ఇస్తుంది. మున్ముందు మరింత కష్టపడి సాధన చేయడానికి నన్ను ప్రేరేపిస్తుందని చెప్పారు.

సర్వజిత్ రెండో మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టడంపై వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం వ్యక్తం చేశారు. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సర్వజిత్ ఆటను మెరుగుపర్చుకోవడానికి, ఆట పట్ల మక్కువ కలిగి ఉంటాడు. అతని నిబద్దత అతనికి మంచి స్థానంలో నిలుపుతుందని ఆశిస్తున్నాను అని లక్ష్మణ్ అన్నారు.