Viral Video: టీమిండియా విజయం సాధించిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల సంబరం
ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిలబడి, చెప్పట్లు కొడుతూ, కరచాలనం చేసుకుంటూ, గంతులేస్తూ సంబరం చేసుకున్నారు. టీమిండియా 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఛటేశ్వర్ పుజారా నిలిచాడు.

Viral Video
Viral Video: బంగ్లాదేశ్ తో ఇవాళ జరిగిన రెండో టెస్టు మ్యాచులో టీమిండియా విజయం సాధించిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లు సంబరం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా రాణించినప్పటికీ భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ 8వ వికెట్ పడకుండా క్రీజులో నిలదొక్కుకుని టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే.
భారత్ 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినప్పటికీ, అనంతరం అశ్విన్, శ్రేయాస్ 42, 29 పరుగులతో రాణించి, వారిద్దరు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓడిపోతుందనుకున్న మ్యాచులో టీమిండియా గెలవడంతో డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు భారత ఆటగాళ్లు అందరూ నిలబడి, చెప్పట్లు కొడుతూ, కరచాలనం చేసుకుంటూ, గంతులేస్తూ సంబరం చేసుకున్నారు.
కాగా, టీమిండియా 2-0తో టెస్టు సిరీస్ గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఛటేశ్వర్ పుజారా నిలిచాడు. టీమిండియా కప్ అందుకుంది. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది. టెస్టు సిరీస్ గెలిచి కసి తీర్చుకుంది.
— cricket fan (@cricketfanvideo) December 25, 2022
Manneguda Kidnap: కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన నవీన్ రెడ్డి