బ్యాటే కాదు.. చేతులూ ఊపాలి : హిట్ మ్యాన్ రోహిత్.. డ్యాన్స్ లో ఫట్!
క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది.

క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది.
క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ప్రత్యర్థులను ఓ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది. అందుకే రోహిత్ కు హిట్ మ్యాన్ అని పేరు వచ్చేందేమో. పరిమిత ఓవర్లకు పెట్టింది పేరు రోహిత్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్. కానీ, మైదానంలో మాత్రమే రోహిత్ అద్భుతంగా ప్రదర్శిస్తాడు. అది బ్యాటింగ్ లో మాత్రమే. కానీ, డ్యాన్స్ లో కాదు.. ఈ వీడియో చూస్తే మీరే అంటారు అవును నిజమే. సిడ్నీలో ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన కోహ్లీసేనకు రెండో వన్డేకు కాస్త విరామం దొరికింది. ఓటమి భారం ఒత్తిడిని పొగట్టుకునేందుకు ఆటవిడుపుగా కాసేపు భారత క్రికెటర్లు సరదాగా గడిపారు.
డ్యాన్స్ క్లాసులు తీసుకున్న ధావన్ కుమార్తె
ఇందులో శిఖర్ ధావన్ చిన్న కుమార్తె రోహిత్ శర్మ సహా క్రికెటర్లకు డ్యాన్స్ క్లాసులు తీసుకుంది. ధావన్ కుమార్తె రోహిత్ కు ఫ్లాస్ డ్యాన్స్ పాఠాలు నేర్పించింది. ఈ డ్యాన్స్ లో రెండు చేతులను పిడికిలి బిగించి బలంగా అటు ఇటు ఊపాలి. కానీ, హిట్ మ్యాన్ రోహిత్.. డ్యాన్స్ లో ఫట్ మ్యాన్ గా ఫెయిలయ్యాడు. ధవన్ కుమార్తెను అనుసరిస్తూ చేతులు ఊపుతూ డ్యాన్స్ చేసేందుకు యత్నించి చేతులేత్తేశాడు. రోహిత్ శర్మ కంటే నేనే బాగా డ్యాన్స్ చేస్తానంటూ ముందుకొచ్చిన కేదార్ జాదవ్ కూడా ఫ్లాస్ స్టెప్పులు వేయలేక తోక ముడిచాడు. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో టీమిండియా పక్కన ధావన్ భార్య అయేషా కూడా అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఆసీస్ తో తొలి వన్డేలో పరాజయం పాలైన కోహ్లీసేన రెండో వన్డేలోనైనా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Hitman learning the floss dance be like ??#TeamIndia pic.twitter.com/37lGysldJC
— BCCI (@BCCI) January 13, 2019