Viral Video: మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. ఎందుకంటే?

ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ ఔట్ కాగానే కోహ్లీ భుజాలు, చేతులను ఊపుతూ డ్యాన్స్ చేశాడు.

Viral Video: మైదానంలో కోహ్లీ డ్యాన్స్.. ఎందుకంటే?

Viral Video

Updated On : March 1, 2023 / 8:31 PM IST

Viral Video: ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ ఔట్ కాగానే కోహ్లీ భుజాలు, చేతులను ఊపుతూ డ్యాన్స్ చేశాడు.

ఆ సమయంలో చాలా మంది మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా, ఇవాళ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే తొలి రోజు ఆటలో కోహ్లీ 22, శుభ్ మన్ గిల్ 21 పరుగులు తీశారు. మాథ్యూ కుహ్నెమాన్ 5, నాథన్ లియోన్ 3 వికెట్లు పడగొట్టారు. భారత్ 33.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయి నిరాశపర్చింది.

తొలి రోజు ఆస్ట్రేలియా156 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో 47 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మొదటి రెండు టెస్టు మ్యాచుల్లో అదరగొట్టిన టీమిండియా, మూడో టెస్టులో తొలి రోజు పేలవ ప్రదర్శన ఇవ్వడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Test rankings-Ravichandran Ashwin: ఆండర్సన్ ను వెనక్కునెట్టి.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నం.1గా అశ్విన్