WI vs IND : భారత్‌తో తొలి టెస్టు.. విండీస్ భారీ కాయుడు వచ్చేశాడు
టీమ్ఇండియా(Team India) వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.

Cornwall returns
WI vs IND 1st Test : టీమ్ఇండియా(Team India) వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. టెస్టు సిరీస్‌తో భారత పర్యటన ఆరంభం కానుంది. జూలై 12 నుంచి మొదటి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 13 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే.. తొలి టెస్టుకు మాత్రమే జట్టుకు ఎంపిక చేయడం గమనార్హం. కెప్టెన్‌గా క్రెగ్ బ్రాట్‌వైట్ (Kraigg Brathwaite) కొనసాగుతుండగా వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో సీనియర్లకు మొండిచేయి చూపించింది. దాదాపుగా కుర్రాళ్లకే అవకాశం ఇచ్చింది.
Virat Kohli Reverse Sweep : కోహ్లి ఇలాంటి షాట్లు ఆడడం ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
విండీస్ భారీ కాయుడు అభిమానులు ముద్దుగా విండీస్ బాహుబలి అని పిలుచుకునే రకీం కార్న్‌వాల్ (Rahkeem Cornwall) దాదాపు ఏడాదిన్నర తరువాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అథనాజ్, మెకంజీ ఆటగాళ్లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. విండీస్ ప్రకటించిన జట్టులో బ్రాత్‌వైట్, హోల్డర్, కీమర్ రోచ్ మినహా మిగిలిన వారందరూ దాదాపుగా కొత్తవాళ్లే. వాళ్లకు పెద్దగా టెస్టులు ఆడిన అనుభవం లేదు.
కాగా.. విండీస్ జట్టుపై ప్రస్తుతం సోషల్‌మీడియాలో నెటీజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్నీ ఎప్పుడూ చూడలేదే అంటూ ఓ నెటీజన్ కామెంట్ చేయగా ఎవర్రా మీరంతా అంటూ ఇంకొకరు అన్నారు. టెస్టు సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని, మూడు రోజుల్లోనే మ్యాచులు ముగిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Sourav Ganguly : టీ20ల్లో రోహిత్ శర్మ, కోహ్లిల కెరీర్ ముగిసినట్లేనా..? గంగూలీ చెప్పింది ఇదే..
మొదటి టెస్టుకు విడీస్ జట్టు..క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.