టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆంటిగ్వాలో సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత వర్షం కురుస్తుండటంతో టాస్‌ని అంపైర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. కాసేపటికి వాతావరణం అనుకూలించడంతో టాస్ వేశారు.
విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ-20 సిరీస్, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలవాలని ఆరాటంగా ఉంది. టెస్ట్ సిరీస్‌ని దక్కించుకొని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ని ఘనంగా ప్రారంభించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు తొలి రెండు సిరీస్‌లను కోల్పోయిన విండీస్ ఈ సిరీస్‌లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది.
జట్ల వివరాలు:
విండీస్: క్రైగ్ బ్రాత్ వైట్, జాన్ కామ్ బెల్, షాయ్ హోప్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్(కెప్టెన్), డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, మైగుల్ కమ్మిన్స్, షనాన్ గాబ్రియెల్, కీమర్ రోచ్
భారత్: మయాంక్ అగర్వాల్, లోకేష్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(కీపర్), అజింక్యా రహానే, హనుమ విహారి, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ భూమ్రా