IPL 2020: అంపైరే KXIP కొంపముంచాడా..!

IPL 2020: అంపైరే KXIP కొంపముంచాడా..!

Updated On : September 21, 2020 / 10:23 AM IST

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2020 సీజన్లో బోణీ కొట్టింది. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మార్కస్ స్టోనిస్ బ్యాటింగ్.. బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగిపోవడంతో మ్యాచ్ దశ తిరిగింది. పంజాబ్ జట్టు ప్లేయర్ మయాంక్ అగర్వాల్ (89; 60 బంతుల్లో) వీరోచిత ప్రదర్శన వృథా అయిపోయింది. చివరి ఓవర్లో 13 పరుగులు సంపాదించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే మయాంక్ ను అవుట్ చేయడంతో ఆ తర్వాతి బంతిని జోర్డాన్ రబాడకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8వికెట్ల నష్టానికి 157పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు సూపర్ ఓవర్ తప్పలేదు. టైగా ముగిసిన మ్యాచ్ కు సూపర్ ఓవర్ నిర్వహించారు అంపైర్లు.




పరుగుల చేధనలో పంజాబ్ కట్టడి చేయలేకపోయింది. రబాడ బౌలింగ్ లో మయాంక్ ఒక్కడే 2పరుగులు చేయగలిగాడు. పంజాబ్ ఫేసర్ షమీ బంతులు సంధించగా పంత్ 2రన్స్ తీయడంతో పాటు ఓ వైడ్ (ఎక్స్ ట్రా)తోడవడంతో ఢిల్లీకే విజయం దక్కింది.

రబాడ వేసిన 18వ ఓవర్లో మూడో బంతి మ్యాచ్ ను తిప్పేసింది. రెండు పరుగులు చేసినప్పటికీ మొదటిది పూర్తి కాలేదని రెండో దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కన్ఫామ్ చేశాడు. రీ ప్లేలో అంపైర్ తప్పు స్పష్టంగానే కనిపించింది. అభిమానులు, నిపుణులు, మాజీ క్రికెటర్లు ఆ నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నారు.




‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఛాయీస్ కు నేను సమ్మతించలేకపోతున్నాను. అంపైర్ డిక్లేర్ చేసిన షార్ట్ రన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పై ప్రభావం చూపిస్తుంది. అది షార్ట్ రన్ కాదు. అదే అక్కడ తేడా అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. భారత మాజీ సీమర్ ఇర్షాన్ పఠాన్ కూడా తన నిర్ణయాన్ని ఇదే విధంగా తెలియజేశాడు.

 

‘షార్ట్ రన్ సరిచేసి మ్యాచ్ ఫలితాన్ని ఎందుకు మార్చకూడదు. ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని సాక్ష్యాలు ఉన్నా అంతేనా. స్పిరిట్ ఆఫ్ గేమ్ కింద ఆలోచిస్తే.. రిజల్ట్ మార్చడానికి ఇంకా అవకాశముంది. దయచేసి మ్యాచ్ ఫలితాన్ని మార్చండి’ అని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అభిమాని మొరపెట్టుకుంటున్నాడు.