ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ ఎగ్జామ్ క్వశ్చన్

ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఏకంగా ఐఐటీ మద్రాస్ వాళ్లే ధోనీ టాస్ గెలిస్తే ఏం చేస్తాడంటూ క్వశ్చన్ చేస్తూ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తమిళనాడు వాసులకు ప్రాంతీయ అభిమానం ఉన్న మాట వాస్తవమే. సొంతజట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐఐటీ మద్రాస్ క్వశ్చన్ పేపర్‌లో చేర్చడం కూడా ఇందులో ఓ భాగమే.
స్టూడెంట్‌లకు క్రికెట్ మీద అవగాహన ఎంతవరకూ ఉన్నదనే విషయం తెలుసుకునేందుకు ఈ ప్రశ్నను వారి ముందుంచింది. 40పాయింట్ల ప్రశ్నాపత్రంలో ఈ ఒక్క ప్రశ్నకు 5పాయింట్లు కేటాయిస్తూ.. చెన్నై వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై టాస్ గెలిస్తే ధోనీ ఏం ఎంచుకుంటాడు. బ్యాటింగా.. బౌలింగా.. అలా ఎంచుకోవడానికి కారణమేమై ఉంటుందనుకుంటున్నారు. అని మే7న ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ సందర్భంగా ఈ ప్రశ్నను అడిగింది.
అనుకున్నట్టే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ చెన్నై 6వికెట్ల తేడాతో చాపచుట్టేసింది. 132 పరుగుల టార్గెట్‍ను ముంబై ఇండియన్స్ చేధించడంతో ఐపీఎల్ 2019 ఫైనల్ చేరుకుంది. సూపర్ కింగ్స్ క్వాలిఫయర్2వ మ్యాచ్‌లోనూ ఓడిపోతే ఇక ఇంటికే.