కీపింగ్‌లో ధోనీ ఉంటే ఏం చేయాలో చెప్తున్న ఐసీసీ

కీపింగ్‌లో ధోనీ ఉంటే ఏం చేయాలో చెప్తున్న ఐసీసీ

Updated On : February 4, 2019 / 10:21 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీపర్‌గా ఉంటే బ్యాట్స్‌మన్ గుండెల్లో హడలే. ధోనీ మెరుపు వేగంతో చేసే స్టంప్ అవుట్‌లకు బలైపోతుంటారు బ్యాట్స్‌మన్. కెరీర్ ఆరంభం నుంచి అదే దూకుడుతో వికెట్లు పడగొడుతున్న ధోనీ గురించి ఐసీసీ కూడా స్పందించింది. ‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు ఆటగాళ్లు క్రీజు వదలొద్దు’ అంటూ ఐసీసీ ట్వీట్‌ చేసింది. 

ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ధోనీ మరోసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. నీషమ్‌ బంతిని ఆడేందుకు ముందుకు రావడంతో కాళ్లకు తగిలి వికెట్ల వెనక్కి వెళ్లింది. దాంతో ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ చేస్తుండగా తేరుకున్న నీషమ్‌ వెనక్కి వెళ్లబోయాడు. ఆ రెప్పపాటు విరామంలోనే వికెట్లను గిరాటేసి పెవిలియన్‌కు పంపేశాడు. దీంతో నీషమ్‌ ఆశ్యర్యపోతూ.. పిచ్‌ను వదిలాల్సి వచ్చింది. ఆ రనౌటే మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. 

ఇంటర్నెట్‌లో వైరల్‌‌గా మారిన వీడియోను ఉదహరిస్తూ ఓ క్రీడాభిమాని ఐసీసీకి ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన ఐసీసీ .. ‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు  క్రీజును వదలొద్దు’ అంటూ ట్వీట్‌ చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్‌ జరగనుంది.