ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన 8 జ‌ట్లు ఏవో తెలుసా..? వెస్టిండీస్ గ‌తి ఇంక అంతేనా..?

ICC Champions Trophy : ప్ర‌పంచ‌క‌ప్‌లో లీగ్ స్టేజీ పూర్తి కావ‌డంతో పాకిస్థాన్ వేదిక‌గా 2025లో జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఏవో తేలిపోయాయి.

ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన 8 జ‌ట్లు ఏవో తెలుసా..?  వెస్టిండీస్ గ‌తి ఇంక అంతేనా..?

ICC Champions Trophy

Updated On : November 13, 2023 / 6:39 PM IST

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఆదివారం భార‌త్, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌తో లీగ్ ద‌శ మ్యాచులు పూర్తి అయ్యాయి. సెమీ ఫైన‌ల్స్‌తో పాటు ఫైన‌ల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. లీగ్ ద‌శ‌లో ఆడిన అన్ని మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన భార‌త్ ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. టీమ్ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు కూడా సెమీస్‌కు చేరుకున్నాయి.

ప్ర‌పంచ‌క‌ప్‌లో లీగ్ స్టేజీ పూర్తి కావ‌డంతో పాకిస్థాన్ వేదిక‌గా 2025లో జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఏవో తేలిపోయాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో లీగ్ స్టేజీ పూర్తి అయ్యే స‌రికి టాప్ 7లో నిలిచిన జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధిస్తాయ‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇది వ‌ర‌కే వెల్ల‌డించింది. కాగా.. ఆతిథ్య దేశం హోదాలో పాకిస్థాన్ ఇప్ప‌టికే అర్హ‌త సాధించింది. అయితే.. పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో పాకిస్థాన్ ఉండ‌డంతో.. పాక్ కాకుండా టాప్ 7 అంటే ప‌ట్టిక‌లో 8వ స్థానం వ‌ర‌కు ఉన్న‌ జ‌ట్లు ఛాంఫియ‌న్స్ ట్రోఫీకి క్వాలిఫై అయ్యాయి.

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే..

సెమీస్‌కు చేరిన టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల‌తో పాటు ఆతిథ్య హోదాలో పాకిస్థాన్, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌లు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించాయి. తొమ్మిదో స్థానంలో నిలిచిన శ్రీలంక‌, ప‌దో స్థానంలో ఉన్న నెద‌ర్లాండ్స్‌లు అర్హ‌త సాధించ‌లేక‌పోయాయి. అలాగే వ‌న్డే ప్ర‌ప‌చ‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌లం అయిన వెస్టిండీస్‌, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆడే అవ‌కాశం లేదు.

Pakistan : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాక్ బౌలింగ్ కోచ్‌ మోర్కెల్ రాజీనామా

ఏ ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు..?

ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఏవో తేలిపోవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌రో దానిపై ప‌డింది. 2025లో పాకిస్థాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఏ ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారా..? లేదంటే టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారా..? అన్నది ఐసీసీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి అయిన త‌రువాత దీనిపై ఓ స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ODI World Cup 2023 : టీమ్ఇండియా రికార్డు.. 31 ఏళ్ల త‌రువాత‌.. ఆ ఇద్ద‌రూ కూడా బౌలింగ్ వేసి ఉంటేనా..?