IND vs ENG : ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..?
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.

Indian players wearing black armbands
Indian players wearing black armbands : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. ఇటీవల మరణించిన భారత మాజీ దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ నివాళి అర్పిస్తూ క్రికెటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
#TeamIndia will be wearing Black Armbands in memory of the legendary Bishan Singh Bedi before the start of play against England in the ICC Men’s Cricket World Cup 2023.#CWC23 | #MenInBlue | #INDvENG
— BCCI (@BCCI) October 29, 2023
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ సోమవారం(అక్టోబర్ 23) కన్నుమూశారు. కెప్టెన్‌గా, లెఫ్టార్మ్ బౌలర్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 1946 సెప్టెంబర్ 25న అమృత్ సర్‌లో జన్మించారు బేడీ. 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన స్పిన్ మాయాజాలంతో సర్దార్ ఆఫ్ స్పిన్ గా పేరుగాంచారు. 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 266 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. 10 వికెట్ల ప్రదర్శన ఓ సారి చేశాడు. 22 టెస్టుల్లో టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. 10 వన్డేల్లో 7 వికెట్లు తీశారు.
ODI World Cup 2023 : ఈ ప్రపంచకప్‌లో విఫలమైన స్టార్ ఆటగాళ్లు.. బాబర్ నుంచి బట్లర్ వరకు
బిషన్ సింగ్ బేడీకి 1970లో కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాన్ని అందజేసి ఆయన్ను గౌరవించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆటకు గుడ్ బై చెప్పిన తరువాత 1900లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సిరీస్‌లకు భారత జట్టు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్, కూతురు నేహా ఉన్నారు.