WI vs IND: తొలి వన్డే.. అతి తక్కువ పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

బార్బడోస్‌లో జరుగుతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

WI vs IND: తొలి వన్డే.. అతి తక్కువ పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

WI vs IND (@BCCI)

Updated On : July 27, 2023 / 9:18 PM IST

WI vs IND – 1st ODI: వెస్టిండీస్ (West indies) టూర్‌లో భాగంగా టీమిండియా (Team India) తొలి వన్డే ఆడుతోంది. బార్బడోస్‌లో జరుగుతున్న ఈ మ్యాచులో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాలోకి ముకేశ్ కుమార్ (Mukesh Kumar) ఆరంగ్రేటం చేశాడు. సంజు శాంసన్, యజువేంద్ర ఛాహల్ కి చోటు దక్కలేదు.

వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. బ్రాండన్ కింగ్ 17, మేయర్స్ 2, అలిక్ అథనాజ్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు. 10 ఓవర్ల నాటికి వెస్టిండీస్ స్కోరు 52/3గా ఉంది.

ఆ తర్వాత కూడా వెస్టిండీస్ రాణించలేకపోయింది. 23 ఓవర్లకే 114 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. బ్రాండన్ కింగ్ 17, అథనాజ్ 22, హోప్ 43, షిమ్రాన్ 11 మినహా మిగతా బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరూ చేయలేదు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3, శార్దూల్, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్

Mukesh Kumar

Mukesh Kumar

వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, రోవ్మాన్ పావెల్, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేశ్ మోతీ

ECS Czechia T10 : కొంప‌ముంచిన కీప‌ర్‌.. క్రికెట్‌లో ఫుట్‌బాల్.. చూస్తే న‌వ్వాపు కోలేరు.. ర‌నౌట్ మిస్‌.. మ్యాచ్ పాయె..