DC vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ (DC vs GT) జరగనుంది.
Will rain interrupt DC vs GT match in IPL 2026 today (pic credit@ipl)
- ఐపీఎల్‌ను వెంటాడుతున్న అకాల వర్షాలు
- సోమవారం కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రద్దు
- మంగళవారం రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ ఓవర్ల కుదింపు
- బుధవారం ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ సజావుగా సాగేనా
DC vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌ను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా వరుణుడు మ్యాచ్‌లకు ఆటంకం కలిగిస్తున్నాడు. సోమవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
దీంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి నేడు (బుధవారం) ఢిల్లీ వేదికగా జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ పైనే పడింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిస్తాడా? ఢిల్లీలో ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుంది అన్న దానిపైనే ఉంది.
బుమ్రా బౌలింగ్‌ను చితక్కొట్టిన బుడ్డోడు.. తొలి బంతికే సిక్స్.. పేస్ గుర్రం రియాక్షన్ వైరల్
అక్యూవెదర్ ప్రకారం ఢిల్లీలో ఉదయం పూట వాతావరణం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే.. మధ్యాహ్నం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 51 శాతం ఉందని అంచనా వేసింది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఉంది. అయితే.. మ్యాచ్ జరిగే సమయం రాత్రి 7 నుంచి 11 వరకు ఎలాంటి వర్షం పడదని తెలిపింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని తెలిపింది. అయితే.. మధ్యాహ్నం పడిన వర్షం తరువాత మైదానాన్ని ఎంత త్వరగా సిద్దం చేస్తారనే దానిపైనే పూర్తి మ్యాచ్ జరగనుందా? ఓవర్లను కుదిస్తారా? అన్నది ఆధారపడి ఉంది.
