ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి..

కివీస్ బౌలర్లలో రోస్ మేరీ మెయిర్ 4 వికెట్లు, లీ తహుహు 3 వికెట్లు తీశారు.

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి..

India Defeat (Photo Credit : Google)

Updated On : October 5, 2024 / 12:46 AM IST

Womens T20 World Cup 2024 : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ తో జరిగిన పోరులో 58 రన్స్ తేడాతో పరాజయం చవి చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. చతికిలపడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది.

మరో ఓవర్ మిగిలి ఉండగానే 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మృతి మందాన (12), షఫాలీ వర్మ (2), హర్మన్ ప్రీత్ కౌర్ (15), జెమీమా రోడ్రిగ్స్(13), రిచా ఘోష్(12) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో రోస్ మేరీ మెయిర్ 4 వికెట్లు, లీ తహుహు 3 వికెట్లు తీశారు.

Also Read : ఏందిరా అయ్యా.. ఐసీసీ మెగా టోర్నీనా, దేశ‌వాలీనా.. తొలి రోజే 13 క్యాచులు మిస్‌..