ODI World Cup 2023 : సెమీ ఫైనల్‌లో ఆడటానికి పాకిస్థాన్ కు నిజంగా అర్హత ఉందా..? : అక్తర్
వన్డే ప్రపంచకప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది.

Does Pakistan Deserve Semi Final Spot says Shoaib Akhtar
ODI World Cup : వన్డే ప్రపంచకప్‌లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన పాకిస్థాన్ ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ప్రస్తుతం పాకిస్థాన్ నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత పాకిస్థాన్ జట్లుపై విమర్శలు ఎక్కువ అయ్యాయి.
పెద్ద జట్లపై పరుగులు చేయాలి
ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని పాకిస్థాన్ జట్టు దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ చెప్పాడు. గెలవాలనే తలపన, సంకల్పం వంటివి పాక్ జట్టులో లోపించాలని అన్నారు. ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌లో ఆడటానికి పాకిస్తాన్ నిజంగా అర్హత ఉందా అని ప్రశ్నించారు. బాబర్ ఆజాం వరుసగా విఫలం అవుతుండడంపై అక్తర్ మండిపడ్డాడు. 14 బంతుల్లో 18 పరుగులు చేసి టచ్‌లో కనిపించిన బాబర్ తనకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నారు. “బిగ్ ప్లేయర్” ట్యాగ్‌ను సమర్థించుకోవడానికి బాబర్ పెద్ద జట్లపై పరుగులు చేయాల్సి ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
IND vs NZ : గతకొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ పై కివీస్ ఆధిపత్యం.. ఈ సారైనా..!
‘బాబర్ అజామ్ గొప్ప ఆటగాడు. అయితే.. అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడాలి. పెద్ద జట్లపై స్కోర్ చేయకుంటే బిగ్ ప్లేయర్ అన్న ట్యాగ్ ఉన్నా ఉపయోగం లేదు. నిలకడగా పెద్ద జట్లపై మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతూ ఉండాలి. ఆశను కోల్పోకూడదు.’ అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం..
అక్తర్ పాక్ జట్టు మేనేజ్‌మెంట్‌పై విరుచుకుపడ్డాడు. బౌలింగ్‌లో ఇఫ్తికార్‌ని తొలి మార్పుగా తీసుకురావడం పై స్పందిస్తూ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే పాక్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో పాకిస్థాన్ ఇంకా ఆడాల్సి ఉంది. ఇలాగే ఆడితే సెమీస్‌కు చేరడం కష్టమని అక్తర్ అన్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 367 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (163; 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (121; 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 45.3 ఓవర్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు.
Pujara : కోహ్లీ సెంచరీ చేసిన తీరుపై పుజారా సంచలన వ్యాఖ్యలు.. జట్టుకు నష్టం..!