IND vs BAN : శ‌త‌క్కొట్టిన కోహ్లీ.. బంగ్లాదేశ్ చిత్తు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

IND vs BAN : శ‌త‌క్కొట్టిన కోహ్లీ.. బంగ్లాదేశ్ చిత్తు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం

Team India

Updated On : October 19, 2023 / 9:30 PM IST

World Cup 2023 IND vs BAN : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్‌లోనూ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. పూణె వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 257 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 41.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (103 నాటౌట్‌; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) శ‌త‌క్కొట్టాడు. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 48వ సెంచ‌రీ. శుభ్‌మ‌న్ గిల్ (53; 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (48; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌) రెండు ప‌రుగుల తేడాతో అర్థ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (19) విఫ‌ల‌మైనా కేఎల్ రాహుల్ (34 నాటౌట్‌) రాణించాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో మెహిదీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హసన్ మహమూద్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ODI World Cup 2023 : న‌న్ను కెమెరాలో చూపించ‌కండి.. నేను వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నా.. మా బాస్‌ను అలాగే అనుకోనివ్వండయ్యా..!

అంత‌క‌ ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో లిట్టన్ దాస్ (66; 82 బంతుల్లో 7 ఫోర్లు), తాంజిద్ హసన్ (51; 43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మదుల్లా 46, ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జ‌స్ ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్, ర‌వీంద్ర జ‌డేజాలు త‌లా రెండు వికెట్లు తీశారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.