WPL 2026 : దాని వ‌ల్లే మేం ఓడిపోయాం.. మంచి విష‌యం ఏంటంటే? హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్‌..

డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) యూపీ వారియర్జ్ చేతిలో ఓట‌మి పై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ స్పందించింది.

WPL 2026 : దాని వ‌ల్లే మేం ఓడిపోయాం.. మంచి విష‌యం ఏంటంటే? హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్‌..

WPL 2026 Harmanpreet Kaur comments after Mumbai Indians lost to UP Warriorz

Updated On : January 17, 2026 / 7:16 PM IST

WPL 2026 : ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడ‌లేక‌పోవ‌డం, అవ‌కాశాల‌ను చేజార్చుకోవ‌డంతోనే తాము యూపీ వారియర్జ్ చేతిలో ఓడిపోయామ‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తెలిపింది. వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యామ‌ని అంది.

ఈ మ్యాచ్‌లో మెగ్ లానింగ్ (70; 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఫోబ్ లీచ్ ఫీల్డ్ (61; 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. ముంబై బౌల‌ర్ల‌లో అమేలియా కెర్ మూడు, నాట్ సైవర్-బ్రంట్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. నికోలా కారీ, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్ త‌లా ఓ వికెట్ తీశారు.

U19 World Cup 2026 : హాఫ్ సెంచ‌రీల‌తో రాణించిన వైభ‌వ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్‌ కుందు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

అనంత‌రం అమేలియా కెర్ (49 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), అమన్‌జోత్‌ కౌర్‌ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో 188 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. యూపీ బౌల‌ర్ల‌లో శిఖా పాండే రెండు వికెట్లు తీయ‌గా.. క్రాంతి గౌడ్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌, దీప్తి శర్మ, క్లో ట్రయాన్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. ఓ జ‌ట్టుగా తాము ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేజింగ్ చేయాల‌ని అనుకున్నామ‌ని చెప్పింది. ‘మా బౌలింగ్ అంత బాగా లేకపోయినప్పటికీ, వారిని 200 పరుగుల లోపే కట్టడి చేయగలిగాము. ఇది ఓ మంచి విషయం. కానీ బ్యాటింగ్‌లో.. ముఖ్యంగా పవర్‌ప్లేలో మేము అంతగా రాణించలేదు.’ అని హ‌ర్మ‌న్ అంది.

U19 World Cup 2026 : అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. బాబ‌ర్ ఆజామ్ రికార్డు బ్రేక్‌..

అవ‌కాశాల‌ను వ‌దిలేసుకుంటే ఇలాగే..

‘ఈ మ్యాచ్‌లో మాత్ర‌మే కాదు.. ఈ సీజ‌న్‌లో పవర్‌ప్లేలో మేము సానుకూల దృక్పథంతో ఆడటం లేదు. దీనిపై త‌ప్ప‌కుండా దృష్టి సారించాలి. వారిద్దరూ (లానింగ్ మరియు లిచ్‌ఫీల్డ్) చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. దురదృష్టవశాత్తు.. మేము కొన్ని అవకాశాలను చేజార్చుకున్నాము. ఇలా మీరు అవకాశాలను వదులుకుంటూ పోతే అవతలి జట్టు మీపై చాలా ఒత్తిడి తెస్తుంది. ఈ రోజూ సరిగ్గా అదే జరిగింది. ఒక జట్టుగా మేము దీని గురించి చర్చించుకోవాలి. ఎందుకంటే మేము చాలా తప్పులు చేశాము.’ అని హ‌ర్మ‌న్ చెప్పుకొచ్చింది.

U19 World Cup 2026 : వార్నీ ఇలా కూడా ర‌నౌట్ అవుతారా? మొత్తానికి పాక్‌ క్రికెటర్‌ అనిపించుకున్నాడు.. వీడియో వైర‌ల్‌

‘మన జట్టు చాలా మంచిదని నాకు తెలుసు. కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి స‌మిష్టిగా రాణిస్తే ఈజీగా మ్యాచ్‌ల‌ను గెల‌వ‌గ‌లమ‌ని అంది. ఆమె (కమలినీ) కీల‌క‌మైన ప్లేయ‌ర్‌. చాలా అద్భుతంగా రాణిస్తోంది. ఆమె ఇలాగే దానిని కొనసాగించాల‌ని ఆశిస్తున్న‌ట్లుగా తెలిపింది. ఇక ఈ టోర్నమెంట్ ప్రారంభంలో హేలీకి ఆరోగ్యం బాగోలేదు. దాని కారణంగా మేము చాలా మార్పులు చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా సమతుల్యంగా ఉన్నాయి. ఉత్తమ ఓపెనింగ్ జోడీని కనుగొంటాము. అమన్‌జోత్, కెర్ లు చాలా బాగా ఆడారు. వారు ఆడుతున్న‌ప్పుడు మ్యాచ్ గెలవగలమనే కొద్దిపాటి ఆశ క‌లిగింది. దుర‌దృష్ట వ‌శాత్తు ఈ మ్యాచ్‌లో గెల‌వ‌లేకపోయాం.’ అని హ‌ర్మ‌న్ అంది.