Peng Shuai: చైనాలో టోర్నమెంట్లను రద్దు చేసిన WTA

ఉమెన్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్ బుధవారం అధికారికంగా ప్రకటించినప్పటికీ అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు మరో ప్రకటన విడుదల చేసింది. చైనాతో పాటు హాంకాంగ్ లో జరిగే ఈవెంట్లను సైతం....

Peng Shuai: చైనాలో టోర్నమెంట్లను రద్దు చేసిన WTA

Wta Tournment

Updated On : December 2, 2021 / 12:37 PM IST

Peng Shuai: ఉమెన్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్ బుధవారం అధికారికంగా ప్రకటించినప్పటికీ అర్ధాంతరంగా రద్దు చేస్తున్నట్లు మరో ప్రకటన విడుదల చేసింది. చైనాతో పాటు హాంకాంగ్ లో జరిగే ఈవెంట్లను సైతం తప్పించింది. టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్.. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నతస్థాయి అధికారిపై చేసిన కామెంట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.

చైనా అధికార ప్రభుత్వం కారణంగా వెనక్కు తగ్గిన ఏకైక స్టోర్స్ట్ ఆర్గనైజేషన్ గా నిలిచింది ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్. పెంగ్ షుయ్ తో నేరుగా కమ్యూనికేట్ అవడం కుదరని పక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉమెన్స్ టెన్సిస్ అఫీషియల్స్ చెప్పారు. పెంగ్ తన సోషల్ మీడియాలో చైనా ఉన్నతాధికారిపై చేసిన కామెంట్లపై క్లారిటీ రాకుండా టోర్నమెంట్లు నిర్వహించలేదమంటూ వారు అన్నారు.

‘ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ పూర్తి సహకారంతోనే చైనాలో జరిగే WTA టోర్నమెంట్స్ అన్నింటినీ సస్పెండ్ చేస్తున్నాం. హాంకాంగ్ లో జరిగేవి కూడా రద్దు చేయాలని ప్లాన్ చేశాం’ అని WTA అఫీషియల్ స్టేట్మెంట్ చెప్పింది.

……………………………………….. : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

అసలేం జరిగింది:
చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్‌ గవోలి.. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ నవంబర్ 2న పెంగ్‌ సోషల్ మీడియాల్లో తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో సెక్స్ చేయాలని బలవంతపెట్టాడని.. ఏడేళ్ల క్రితం ఓ సారి తప్పక పాల్గొన్నానని అందులో పేర్కొంది. చేసిన కాసేపటికీ ఆ పోస్టును తొలగించడం గమనార్హం.

అప్పటి నుంచి ఆమె గురించి ఎటువంటి సమాచారం లేదు. ఈ క్రమంలోనే షువాయికి ఏమైందోనని అభిమానులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పెంగ్‌ ఎక్కడ?’ అంటూ సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రముఖుల వరకూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పురుషుల, మహిళల టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యులు సైతం ఆమె గురించి సమాచారం కోసం చైనా అధికారులను కోరారు.

చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి జావో లిజియాన్‌ మాట్లాడుతూ.. ఇది దౌత్యపరమైన విషయం కానందున తనకు పూర్తి సమాచారం తెలియదని పేర్కొన్నారు.

………………………………….. : ఉదయం కంటే రాత్రి వేళల్లో మన శరీరం బరువు ఎక్కువగా ఉంటుందా!…