Yuzvendra Chahal : ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. 200 వికెట్ల క్ల‌బ్‌లో చాహ‌ల్‌

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Chahal 200 IPL Wickets : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మొద‌టి బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. సోమ‌వారం జైపూర్‌లోని స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో చాహ‌ల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ముంబై ఆట‌గాడు మ‌హ్మ‌ద్ న‌బీ (23; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) ని ఔట్ చేయ‌డం ద్వారా చాహ‌ల్ ఐపీఎల్‌లో 200 వికెట్ల క్ల‌బ్‌లో అడుగు పెట్టాడు.

ఐపీఎల్‌లో ముంబైతో మ్యాచ్‌తో క‌లిపి చాహ‌ల్ 152 మ్యాచులు ఆడాడు. 7.70 ఎకాన‌మీతో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత్యుత్త‌మ బౌలింగ్ 5/40.

Trent Boult : చ‌రిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్‌.. మొద‌టి ఓవ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు..

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా చాహ‌ల్ కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ ఆట‌గాడు డ్వేన్ బ్రేవో 183 వికెట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

యుజ్వేంద్ర చాహల్ – 200 వికెట్లు
డ్వేన్ బ్రావ‌క్ష – 183 వికెట్లు
పీయూష్ చావ్లా – 185
అమిత్ మిశ్రా – 173
భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 173
ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 172
ల‌సిత్ మ‌లింగ – 170
సునీల్ న‌రైన్ – 167
ర‌వీంద్ర జ‌డేజా – 156
జ‌స్‌ప్రీత్ బుమ్రా – 150

KKR vs RCB : ఆర్‌సీబీ ఓట‌మికి అంపైర్లే కార‌ణం.. ? ఆ రెండు ప‌రుగులు ఇచ్చుంటే..?

ట్రెండింగ్ వార్తలు