Yuzvendra Chahal : ఆసియా క‌ప్‌లో ద‌క్క‌ని చోటు.. చ‌హ‌ల్ ట్వీట్ వైర‌ల్

ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును సోమ‌వారం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్న‌ర్ య‌జువేంద్ర చ‌హ‌ల్‌కు చోటు ద‌క్క‌లేదు.

Yuzvendra Chahal : ఆసియా క‌ప్‌లో ద‌క్క‌ని చోటు.. చ‌హ‌ల్ ట్వీట్ వైర‌ల్

Yuzvendra Chahal

Yuzvendra Chahal Tweet : ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క‌ప్‌(Asia cup)లో పాల్గొనే భార‌త జ‌ట్టును సోమ‌వారం సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. 17 మందితో కూడిన ఈ బృందంలో స్పిన్న‌ర్ య‌జువేంద్ర చ‌హ‌ల్‌(Yuzvendra Chahal)కు చోటు ద‌క్క‌లేదు. ఆసియా క‌ప్‌కు ఎంపిక చేసిన జ‌ట్టునే దాదాపుగా స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లోనూ ఆడించే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్ర‌పంచ‌క‌ప్‌లో చహ‌ల్ ఆడే అవ‌కాశాలు చాలా స్వ‌ల్పం. చ‌హ‌ల్‌ను కాద‌ని మ‌ణిక‌ట్టు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్ల కోటాలో ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు.

ఆసియా క‌ప్‌లో త‌న‌కు చోటు ద‌క్కుతుంద‌ని ఎంతోగానో బావించాడు చ‌హ‌ల్‌. అయితే.. తన ఆశ నిరాశ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఎవ‌రిని ఎలాంటి మాట అన‌లేదు.. స‌రిక‌దా ఎటువంటి ప‌దాలు రాయ‌కుండే రెండంటే రెండు ఎమోజీల‌తో కూడిన ఓ ట్వీట్ ను చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు అత‌డికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్‌లో రోహిత్‌, కోహ్లి బౌలింగ్ చేస్తారు.. మ‌రీ అంత కామెడీ చేయ‌క్క‌ర్లేదు భ‌య్యా..!

ఇంతకీ చ‌హ‌ల్‌ ఏం పోస్ట్ చేశాడంటే..? మ‌బ్బుల చాటున దాగిఉన్న సూర్యుడు ఎమోజీతో పాటు మ‌బ్బులు తొల‌గిన త‌రువాత ప్ర‌కాశిస్తున్న సూర్యుడి ఎమోజీల‌ను పోస్ట్ చేశాడు. సూర్యుడి ప్ర‌కాశాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు. మ‌బ్బులు కొంత‌సేపే ఆప‌గ‌ల‌వు. సూర్యుడు మ‌ళ్లీ ఉద‌యిస్తాడు అనే అర్థం వ‌చ్చేలా పోస్ట్ చేశాడు. త్వ‌ర‌లోనే నీకు మంచి రోజులు వ‌స్తాయి అంటూ నెటీజ‌న్లు అత‌డికి మ‌ద్ద‌తుగా కామెంట్లు చేస్తున్నారు.

జ‌ట్టులో చహ‌ల్ ఎంపిక చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తో పాటు చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ వెల్ల‌డించారు. జ‌ట్టులో 17 మందికే చోటు ఉంద‌ని, అందుక‌నే చహ‌ల్ ఎంపిక చేయ‌లేద‌ని రోహిత్ చెప్పాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు అత‌డికి ఇంకా దారులు మూసుకుపోలేద‌న్నాడు. ఇక అగార్క‌ర్ మాట్లాడుతూ.. జ‌ట్టులో ఇద్ద‌రు రిస్ట్ స్పిన్న‌ర్ల‌కు ఒకే సారి చోటు ఇవ్వ‌లేమ‌ని చెప్పుకొచ్చాడు. చ‌హ‌ల్ కంటే కుల్దీప్ మెరుగ్గా క‌నిపించ‌డంతో అత‌డిని ఎంపిక చేసిన‌ట్లు చెప్పాడు. ఈ క్ర‌మంలో చ‌హ‌ల్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Olga Carmona : జ‌ట్టును విశ్వ‌విజేత‌గా నిలిపింది.. తీవ్ర విషాదంలో ముగిపోయింది.. ఓ ఛాంపియన్‌ వ్యథ