Zimbabwe : అఫ్గానిస్థాన్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు జింబాబ్వే జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ సోద‌రుడికి చోటు..

అఫ్గానిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచుల వ‌న్డే, టీ20 సిరీసుల్లో పాల్గొనే జింబాబ్వే జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

Zimbabwe : అఫ్గానిస్థాన్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు జింబాబ్వే జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ సోద‌రుడికి చోటు..

Zimbabwe squads for ODI and T20I series vs Afghanistan announced

Updated On : December 9, 2024 / 7:36 PM IST

అఫ్గానిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచుల వ‌న్డే, టీ20 సిరీసుల్లో పాల్గొనే జింబాబ్వే జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. టీ20 జట్టుకు సికందర్ రజా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. వ‌న్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. కాగా.. వ‌న్డే జ‌ట్టులో ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు సామ్ క‌ర్రాన్, టామ్ క‌ర్రాన్ ల సోద‌రుడు బెన్ క‌ర్రాన్ కు చోటు ద‌క్కింది. జింబాబ్వే దేశ వాలీ క్రికెట్‌లో 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట‌ర్‌ అద్భుత ప్ర‌దర్శ‌న చేయ‌డంతోనే అత‌డు తొలి సారి జాతీయ జ‌ట్టుకు ఎంపిక అయ్యాడు.

ఇత‌డితో పాటు యువ లెఫ్టార్మ్ పేసర్ న్యూమాన్ న్యామ్‌హూరి కూడా తొలి జాతీయ జ‌ట్టుకు ఎంపిక అయ్యాడు. ఇత‌డు రెండు జ‌ట్ల‌లోనూ చోటు సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో జింబాబ్వే తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిల‌వ‌డంతో అత‌డిని ఎంపిక చేశారు.

IND vs AUS : ఓట‌మి బాధ‌లో ఉన్న‌ టీమ్ఇండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ..

మొద‌టగా టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 11 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. డిసెంబ‌ర్ 11న తొలి టీ20, డిసెంబ‌ర్ 13న రెండో టీ20, డిసెంబ‌ర్ 14న మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మూడు మ్యాచులు హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

ఇక వ‌న్డే సిరీస్ విష‌యానికి వ‌స్తే.. డిసెంబ‌ర్ 17 నుంచి ఆరంభం కానుంది. డిసెంబ‌ర్ 17న తొలి వ‌న్డే, డిసెంబ‌ర్ 19న రెండో వ‌న్డే, డిసెంబ‌ర్ 21న మూడో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు మ్యాచులు కూడా హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్‌లోనే జ‌ర‌గ‌నున్నాయి.

IND vs AUS : రెండో టెస్టులో భార‌త్ పై విజ‌యం.. 24 గంట‌ల్లోనే ఆస్ట్రేలియా ఆనందం ఆవిరి.. కొంప‌ముంచిన ద‌క్షిణాఫ్రికా..

టీ జట్టు : సికందర్ రజా (కెప్టెన్‌), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటేన్ మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ఎన్ ముసెకివా, రియాన్ ముసెకివా, న్యూచర్‌మన్ ముసెకివా,

వన్డే జట్టు : క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్‌), బ్రియాన్ బెన్నెట్, బెన్ కుర్రాన్, జాయ్‌లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోడెనె మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్‌టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ న్‌గరావరి, సీన్ విలియమ్స్