T20 World Cup 2024 : తొలి మ్యాచ్‌లోనే ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా సంచ‌ల‌న విజ‌యం..

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఘ‌నంగా ఆరంభ‌మైంది.

T20 World Cup 2024 : తొలి మ్యాచ్‌లోనే ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా సంచ‌ల‌న విజ‌యం..

PIC credit : ICC

T20 World Cup 2024 – USA vs CAN : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఘ‌నంగా ఆరంభ‌మైంది. మొద‌టి మ్యాచులోనే ప‌రుగుల వ‌ర‌ద పారింది. కెన‌డా పై ఆతిథ్య అమెరికా ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌మ అరంగ్రేట ఐసీసీ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే విజ‌యం సాధించి అమెరికా స‌గ‌ర్వంగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆరంభించింది.

డ‌ల్లాస్ వేదిక‌గా కెన‌డా, అమెరికా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కెన‌డా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. నవనీత్‌ ధాలివాల్‌(44 బంతుల్లో 61), నికోలస్ కిర్ట‌న్‌(31 బంతుల్లో 51) హాఫ్ సెంచ‌రీలు బాదారు. అమెరికా బౌల‌ర్ల‌లో అలీఖాన్‌, హ‌ర్మీత్ సింగ్‌, కోరె అండ‌ర్స‌న్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.
Virat Kohli : అవును ఇది నిజం.. ఆ రోజు ఎంతో భ‌య‌ప‌డ్డా : విరాట్ కోహ్లి

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో అమెరికా మొద‌ట త‌డ‌బ‌డింది. ఓపెన‌ర్ స్టీవెన్ టేల‌ర్ డ‌కౌట్ కాగా.. కెప్టెన్ మోనాన్స్ ప‌టేల్ (16) త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. జ‌ట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ల‌ను ఆండ్రీ గౌస్ (46 బంతుల్లో 65), వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స‌ర్లు 94 నాటౌట్‌) భుజాల పై వేసుకున్నారు. ఓ వైపు గౌస్ నెమ్మ‌దిగా ఆడ‌తుంటే మ‌రో వైపు జోన్స్ రెచ్చిపోయాడు.

ఎడాపెడా బౌండ‌రీలు బాదాడు. గౌస్ కూడా జోరందు కోవ‌డంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో ప‌రుగులు పెట్టింది. జోన్స్ ఔటైనా.. కోరే ఆండర్సన్ (3 నాటౌట్‌) తో కలిసి జోన్స్ జ‌ట్టుకు చారిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించాడు. కాగా.. టీ20ల్లో అమెరికా ఇదే అత్యుత్త‌మ ల‌క్ష్య ఛేద‌న కావ‌డం విశేషం.

Gautam Gambhir : గంభీర్‌ను సునీల్ న‌రైన్ అడిగిన మొద‌టి ప్ర‌శ్న‌.. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీఎల్‌కు తీసుకురావొచ్చా..? గౌతీ ఆన్స‌ర్..