ఈ ఒకే ఒక్క యాప్‌లో ఎన్నెన్ని సర్వీసులో.. ప్రతిరోజు మనకు అవసరమయ్యేవే..

దీనిని దేశంలోని ఏ బ్యాంకుకైనా లింక్ చేయవచ్చు.

ఈ ఒకే ఒక్క యాప్‌లో ఎన్నెన్ని సర్వీసులో.. ప్రతిరోజు మనకు అవసరమయ్యేవే..

Updated On : March 15, 2025 / 3:47 PM IST

రిలయన్స్ మైజియో యాప్‌లో ఎన్నో రకాల సర్వీసులు అందుతున్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో ఆ యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆ యాప్‌ ద్వారా ప్రతిరోజు అవసరమయ్యే ఏడు సర్వీసులను అందుకోవచ్చు.

యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు
జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా యూజర్లకు అందుబాటులో ఉన్న మైజియో యాప్‌ నుంచి యూపీఐ ఐడీలకు డబ్బు పంపుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్‌పే లాగానే యూజర్లు మైజియో యాప్ ద్వారా ఉచితంగా డబ్బులు పంపుకోవచ్చు. అలాగే, ఇతరుల నుంచి డబ్బును మైజియో యాప్ ద్వారా స్వీకరించవచ్చు. ఇందు కోసం మీరు కొత్త యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని దేశంలోని ఏ బ్యాంకుకైనా లింక్ చేయవచ్చు.

జియో మొబైల్స్‌ రీఛార్జ్ చేసుకోవచ్చు
మైజియో యాప్ ద్వారా మొబైల్, ఫైబర్, ఎయిర్ ఫైబర్ రీఛార్జ్‌లను ప్లాట్‌ఫాం ఛార్జీలు లేకుండా చెల్లించుకోవచ్చు. మీరు పోస్ట్‌పెయిడ్ యూజర్‌ అయితే మీ మైజియో యాప్‌లోనే మీ బిల్లులను నేరుగా ఈ యాప్‌లోనే చెల్లించవచ్చు.

Also Read: 214 మంది బందీలను చంపేశాం.. ఎందుకంటే..: బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన

కాలర్ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు
మౌజియో యాప్ ద్వారా మీ జియో ఫోన్ నంబర్‌లో జియో ట్యూన్స్‌ను ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. అయితే, ఈ ట్యూన్‌లు నెల రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా డిసేబుల్ అవుతాయి. ప్రతి నెలా యాప్‌లోనే మళ్లీ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో ట్యూన్‌ను సెట్ చేయడానికి జియోసావన్ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్
మైజియో యాప్ ద్వారా 100 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా లభ్యమవుతుంది. ఇది మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్‌ వంటి టెక్ కంపెనీలు అందించే స్టోరేజీ కంటే చాలా ఎక్కువ. ఈ స్టోరేజీని ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మ్యూజిక్‌ వంటివాటిని అప్‌లోడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు.

డు నాట్‌ డిస్టర్బ్ ఆప్షన్
ప్రస్తుత కాలంలో స్పామ్ కాల్స్ పెరిగిపోయాయి. అవి రాకుండా ఉండేందుకు మైజియో యాప్‌లోని డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్‌ ద్వారా వాటిని డిసేబుల్ చేయవచ్చు.

ఇతర జియో కనెక్షన్‌లను మేనేజ్‌ చేయొచ్చు
మీరు జియో ఫైబర్ లేదా ఎయిర్‌ ఫైబర్‌ యూజర్లయితే మైజియో యాప్ ద్వారా ఈ కనెక్షన్‌లను కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మీ కనెక్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను యాక్సెస్ చేయవచ్చు. దీని ద్వారా మీ రీఛార్జ్ ప్లాన్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రదేశానికి మారుతుంటే మీ కనెక్షన్‌ను ఆ కొత్త ప్రదేశానికి తరలించడానికి కూడా ఈ యాప్‌ ద్వారా రిక్వెస్ట్‌ పంపవచ్చు.

కిరాణా సామగ్రిని కూడా కొనవచ్చు
జియోమార్ట్ నుంచి షాపింగ్ చేయడానికి ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే మైజియో ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చు. కిరాణా సామగ్రి, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేయవచ్చు.