Airtel Prepaid Plans : యూజర్లకు బిగ్ షాక్.. ఈ 2 ప్రీపెయిడ్ ప్లాన్లు సైలెంట్‌గా ఎత్తేసింది.. OTT బెనిఫిట్స్ పోయినట్టే.. చెక్ చేసుకోండి!
Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్ అందించే రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరు వాడే రీఛార్జ్ ప్లాన్ ఇదేనా కాదో చెక్ చేసుకోండి.
Airtel Prepaid Plans
Airtel Prepaid Plans : భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఎయిర్‌టెల్ సైలెంట్‌గా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. మీరూ చెక్ చేశారా? లేదంటే ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్లలో రూ.121 రూ.181 ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌లు కనిపించవు.
అంతేకాదు.. ఈ రెండూ రీఛార్జ్ ప్లాన్లు (Airtel Prepaid Plans) సరసమైన ధరలో 30-రోజుల డేటా యాడ్-ఆన్ ఆప్షన్లను అందిస్తాయి. ఇకపై ఈ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండవు. ఇదే విషయాన్ని ఫస్ట్ టెలికామ్‌టాక్ గుర్తించింది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లతో వెబ్‌సైట్, యాప్‌ను అప్‌డేట్ చేసింది.
నిలిపివేసిన రీఛార్జ్ ప్లాన్లు ఇవే :
వాస్తవానికి, నిలిపివేసిన రీఛార్జ్ ప్యాక్‌లు బాగా పాపులర్ అయ్యాయి. హై-స్పీడ్ డేటా బెనిఫిట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంకు ఫ్రీ యాక్సెస్ కూడా అందించాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ (జియోహాట్‌స్టార్), సోనీలైవ్ సహా 25 కన్నా ఎక్కువ OTT సర్వీసుల నుంచి కంటెంట్‌ను అందిస్తుంది. ఈ రెండు ప్యాక్‌లు నిలిచపోవడంతో వినియోగదారులు ఇప్పుడు డేటా-ఓన్లీ రీఛార్జ్‌లపై ఆధారపడొచ్చు.
కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఏంటి? :
అత్యంత సరసమైన డేటా యాడ్-ఆన్ ఇప్పుడు రూ. 100కే లభిస్తోంది. 6GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో పాటు, SonyLIV యాక్సెస్, Airtel Xstream Play ద్వారా 20 అదనపు OTT ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తుంది. స్పీడ్ డేటా వాడే యూజర్ల కోసం రూ. 161 ప్యాక్ అదే 30 రోజుల వ్యాలిడిటీతో 12GBని అందిస్తుంది.
ఆ తర్వాత ఎయిర్‌టెల్ బెస్ట్ క్రికెట్ ప్యాక్‌గా రూ. 195 ఆప్షన్ కూడా అందిస్తోంది. ఇందులో 12GB డేటా కూడా పొందవచ్చు. కానీ, ఎక్స్‌ట్రీమ్ ప్లే బెనిఫిట్స్‌తో పాటు నెల రోజులు జియోహాట్‌స్టార్‌కు మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. మీరు కేవలం భారీ డేటా రీఫిల్ కోరుకుంటే రూ. 361 ప్యాక్ 30 రోజులకు 50GB అందిస్తుంది. మీ కోటాను పూర్తి చేశాక ఎయిర్‌టెల్ మీకు 1MBకి 50 పైసల చొప్పున బిల్లు చేస్తుంది.
ఇప్పుడు ఎందుకంటే? :
ట్రాయ్ లేటెస్ట్ సబ్‌స్క్రిప్షన్ డేటా ప్రకారం.. ఎయిర్‌టెల్ వైర్‌లెస్ యూజర్ బేస్ ఆకట్టుకునేలా 393.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లకు పెరిగింది. 33.59 శాతం మార్కెట్ వాటా పెరిగిందని వెల్లడించిన కొద్దిసేపటికే ఈ మార్పు వచ్చింది. టెలికాం దిగ్గజం ఇటీవలే 1.25 మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లను చేర్చుకుంది.
