Airtel Unlimited Plan : షాకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్ దెబ్బకి జియో టెన్షన్‌లో.. రూ.189 ప్లాన్ ఔట్.. రూ.199తో కొత్త గేమ్..!

Airtel Unlimited Plan : ఎయిర్‌టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఎయిర్‌టెల్ రూ.189 ప్లాన్ ఇక రీఛార్జ్ చేసుకోలేరు. ఇకపై రూ. 199 ప్లాన్ మాత్రమే ఎంట్రీ లెవల్ ప్లాన్.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే?

Airtel Unlimited Plan : షాకింగ్ న్యూస్.. ఎయిర్‌టెల్ దెబ్బకి జియో టెన్షన్‌లో.. రూ.189 ప్లాన్ ఔట్.. రూ.199తో కొత్త గేమ్..!

Airtel Unlimited Plan

Updated On : November 10, 2025 / 2:48 PM IST

Airtel Unlimited Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. మీరు వాడే రీఛార్జ్ ప్లాన్ ఇదేనా? అయితే, ఇకపై ఈ రీఛార్జ్ ప్లాన్ కనిపించదు. ఎయిర్‌టెల్ రూ.189 రీఛార్జ్ ప్లాన్ నిలిపివేసింది. చౌకైన ఎంట్రీ లెవల్ అన్‌లిమిటెడ్ ప్లాన్ల లిస్టు నుంచి రూ.189 ప్లాన్‌ను తొలగించినట్లు కనిపిస్తోంది. మీరు కూడా ఓసారి చెక్ చేసుకోండి.

టెలికామ్‌టాక్ రిపోర్టు ప్రకారం.. ఎయిర్‌టెల్ డెస్క్‌టాప్ సైట్‌ (Airtel Unlimited Plan) ప్రకారం.. చౌకైన అన్‌లిమిటెడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 199 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 189 రియల్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ఇకపై అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించదు. మీరు కూడా ఇదే ప్లాన్ తీసుకుని ఉంటే ఇకపై రూ. 199 ప్లాన్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ కొత్త ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అన్‌లిమిటెడ్ ప్లాన్లపై బెనిఫిట్స్ :
భారతీ ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ ప్లాన్లలో ప్రీపెయిడ్ యూజర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ SMS బెనిఫిట్స్ అందిస్తాయి. ఈ టారిఫ్‌లు విభిన్న యూజర్ల కోసం రూపొందించింది. డేటా-ఆధారిత, వాయిస్-ఆధారిత లేదా వాయిస్ SMS-ఓన్లీ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ ప్రీపెయిడ్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌ల ప్రారంభ ధర రూ. 189 ఉండగా, కొత్త ఎంట్రీ-లెవల్ ధర ఇప్పుడు రూ. 199 నుంచి లభ్యమవుతుంది.

Read Also : Aadhaar App : కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. మొబైల్‌లో ఆధార్ పవర్ ఇప్పుడు మీ చేతుల్లో.. అంతా ఒకే యాప్‌లో!

రూ. 189 ప్లాన్ రద్దు :
ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రూ.189 ప్లాన్. ఇకపై అందుబాటులో ఉండదు. ఇకపై రూ. 199 ప్లాన్‌ కొత్త ఎంట్రీ-లెవల్ టారిఫ్‌గా ఉంటుంది. రూ. 189 ప్లాన్ అనేది వాయిస్ సర్వీసులపై ఎక్కువగా ఆధారపడే సర్వీస్ యాక్టివేషన్ కోసం కనీస డేటా అవసరమయ్యే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఎక్కువ టైమ్ డేటా వాడేవారికి పెద్దగా అవసరం ఉండదు. ఎయిర్‌టెల్ రూ. 189 రీఛార్జ్ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్, 1GB మొబైల్ డేటా, 300 SMS బెనిఫిట్స్ అందిస్తుంది.

కొత్త ఎంట్రీ లెవల్ రూ. 199 ప్లాన్ వివరాలివే :

  • ఎయిర్‌టెల్ కొత్త ఎంట్రీ లెవల్ రూ. 199 ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
  • అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
  • రోజుకు 100 SMS మెసేజ్‌లు
  • మొత్తం 2GB డేటా
  • 2GB డేటా కోటా తర్వాత 1MBకి రూ.0.50 చొప్పున ఛార్జీలు పడతాయి.
  • ప్రీపెయిడ్ యూజర్లకు రూ.219 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.