Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4 నుంచి ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అప్లియన్సెస్ మరిన్నింటితో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది.

Amazon Great Summer Sale announced, to offer discount on smartphones, ACs, and other electronics
Amazon Great Summer Sale : ప్రముఖ ఆన్‌లైన్ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారమ్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale)ను ప్రకటించింది. మే 4, 2023 నుంచి కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, అప్లియన్సెస్ సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ (Amazon Prime Members) సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం 12 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే బ్యాంక్ ఆఫర్‌లను కూడా ప్రకటించింది. ఇందులో (ICICI) కోటక్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు 10శాతం ఇన్‌స్టంట్ సేవింగ్ అందిస్తుంది. అమెజాన్ రాబోయే సేల్ వెబ్‌పేజీని కూడా క్రియేట్ చేసింది. మరెన్నో ఆఫర్‌లను అందిస్తుంది.
అమెజాన్ వెబ్ పేజీలో అనేక భారీ డిస్కౌంట్లను రివీల్ చేసింది. ఈ సేల్ సందర్భంగా రూ. 99, రూ. 199 వాటి కన్నా తక్కువ ధరల కేటగిరీ స్టోర్‌లను ఆఫర్ చేస్తుందని పేర్కొంది. మొబైల్ కేటగిరీలో రూ. 18,499 డిస్కౌంట్ ధరతో (OnePlus Nord CE 2 Lite)ని కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా (Redmi 12C) రాబోయే సేల్‌లో రూ. 8,999కి అందుబాటులో ఉంటుంది.

Amazon Great Summer Sale announced, to offer discount on smartphones
మరోవైపు, OnePlus Bullets Z2 ధర రూ. 1,599కి ఆఫర్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో.. ఇతర స్మార్ట్‌టీవీలు, ఇతర అప్లియన్సెస్ కేటగిరీపై కొనుగోలుదారులు 60శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ పేజీలో OnePlus Y సిరీస్ HD, LED Android TV రూ.14,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.
LG 190L సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను రూ. 17,490 వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే, LG 1.5 టన్ను 5 స్టార్ AI డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ధర రూ. 46,490 వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ యూజర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI కొనుగోలు ఆప్షన్ కూడా అందిస్తుంది.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ విభాగంలో జీబ్రానిక్స్ హేజ్ వైర్‌లెస్ మౌస్ ధర రూ. 249కి అందుబాటులో ఉంటుంది. ఫైర్-బోల్ట్ నింజా సాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌వాచ్ రూ.1,699కి కొనుగోలు చేయొచ్చు. Boat Rockerz+ 255 Pro+ నెక్‌బ్యాండ్ రిటైల్ ధర రూ. 3,999 కన్నా తక్కువగా అందుబాటులో ఉంటుంది.