Samsung: అతి తక్కువ ధరకే ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు మాత్రం అదుర్స్‌.. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.

Samsung: అతి తక్కువ ధరకే ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు మాత్రం అదుర్స్‌.. 

Updated On : April 2, 2025 / 1:49 PM IST

శాంసంగ్‌ గెలాక్సీ ఎం06 5G స్మార్ట్‌ఫోన్‌ గత నెలలో భారత్‌లో విడుదలైంది. మార్చి 7 నుంచి రూ.9,999 ధరతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ 5జీ ఫోన్ విడుదలైన నెల రోజుల్లోనే దాని ధరను కంపెనీ రూ.801 తగ్గించింది. ఇప్పుడు కేవలం రూ.9,198కే దీన్ని కొనుక్కోవచ్చు.

శాంసంగ్‌ నుంచి విడుదలైన అతితక్కువ ధరకు లభిస్తున్న 5జీ ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 9,999. 4GB RAM 5G ఫోన్ అమెజాన్‌లో రూ. 9,198కే అందుబాటులో ఉంది. తగ్గింపు ధర పొందాలంటే బ్యాంక్ కార్డ్ లేదా వోచర్ వంటివి కూడా వాడాల్సిన అవసరం లేదు. నేరుగా ఈ డిస్కౌంట్ అందుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం06 5G స్మార్ట్‌ఫోన్‌ సేజ్‌ గ్రీన్, బ్లేజింగ్ బ్లాక్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంది. మొదట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499గా ఉంది. ప్రస్తుతం రూ.10,699కే లభ్యమవుతోంది.

Also Read: లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు.. అసలు ఏంటిది? ఈ బిల్లులో ఏముంది?

ఫీచర్లు
శాంసంగ్‌ గెలాక్సీ ఎం06 5Gలో 720 x 1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల HD+ స్క్రీన్‌ ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో ఇది విడుదలైంది. ఆండ్రాయిడ్‌ 15తో ఇది పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాక్‌ ఉండే కంప్యూటింగ్ పవర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ CPU, ఇది 2.4GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో రాండమ్-యాక్సెస్ మెమరీను మరింత మెరుగుపర్చి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. ఈ మొబైల్ వెనుక ప్యానెల్‌లో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, F/1.8 ఎపర్చరు, LED ఫ్లాష్‌లైట్‌తో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.