Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!
Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) సందర్భంగా ఐఫోన్ 13 రూ. 40వేల లోపు ధరకు అందుబాటులో ఉంటుంది.

Apple iPhone 13 to Be Available Under Rs 40,000 During Amazon Great Indian Festival Sale
Apple iPhone 13 Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ( Amazon Great Indian Festival Sale 2023) అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్కు ముందు, అమెజాన్ యూజర్ల కోసం కొన్ని డీల్‌లను టీజ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో లేటెస్ట్ ఐఫోన్ 13 (Apple iPhone 13 Sale)పై తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఈ హ్యాండ్సెట్ ధరను రూ. 40వేల లోపు తగ్గించింది.
అయితే, ఈ ధర వినియోగదారులకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ని ఎంచుకోకపోతే.. ఐఫోన్ 13 సేల్ సమయంలో కొంచెం ఎక్కువ ధరకు పొందవచ్చు. 2021లో లాంచ్ అయిన ఐఫోన్ 13 ప్రస్తుతం 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 59,900, రూ. 256GB మోడల్‌కు రూ. 69,900, రూ. 512GB మోడల్ రూ. 89,900కు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 13 అధికారిక రూ. 20వేల ధరకు కొనుగోలు చేయొచ్చు.

Apple iPhone 13 to Be Available Under Rs 40,000 During Amazon Great Indian Festival Sale
రూ. 40వేల లోపు ధరకే ఐఫోన్ 13 :
అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా.. ఆసక్తి గల కస్టమర్లు ఐఫోన్ 13ని అతి తక్కువ ధరకు పొందవచ్చు. రూ. 59,900 ధరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంకా, కస్టమర్లు SBI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా రూ. 1,500 గరిష్ట తగ్గింపుగా అందిస్తుంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా.. SBI బ్యాంక్ కస్టమర్లు మొబైల్ కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర కేటగిరీలకు గరిష్ట పరిమితి రూ. 1,750కు అందిస్తుంది.
ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు :
అమెజాన్‌లో పాత డివైజ్ (వర్కింగ్ స్మార్ట్‌ఫోన్) ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 13పై డీల్ ధర, బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ధర రూ. 40వేల ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. డిమాండ్ పెరిగేకొద్దీ, స్టాక్లను బట్టి ఐఫోన్ 13 డీల్ ధరలను అమెజాన్ పెంచవచ్చు. ఐఫోన్ 13 కాకుండా, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో వంటి ఇతర ఐఫోన్ మోడల్‌లపై అమెజాన్ డిస్కౌంట్లను అందించనుంది.