Amazon Great Indian Festival Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసుకోండి!

Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. సేల్‌కు సంబంధించిన పేజీ అమెజాన్‌లో లైవ్‌లో ఉంది. (iPhone 13) ఇతర ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండవచ్చు.

Amazon Great Indian Festival Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసుకోండి!

Amazon Great Indian Festival Sale Announced

Amazon Great Indian Festival Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. రాబోయే కొత్త సేల్‌కు సంబంధించిన పేజీ ఇప్పటికే అమెజాన్‌లో లైవ్‌లో ఉంది. ఈ సేల్ ఈవెంట్ త్వరలో ప్రారంభం కానుంది. కానీ, టిప్‌స్టర్లు ముకుల్ శర్మ, అభిషేక్ యాదవ్ ఈవెంట్ టీజర్ షేర్ చేశారు. అమెజాన్ సేల్ (Amazon Sale Date 2023) అక్టోబర్ 10న ప్రారంభం కానుందని టీజర్ వెల్లడించింది. కేవలం 2 నెలల దూరంలో ఉన్న దీపావళి పండుగ (Diwali Festival Sale) వేడుకల సేల్ అని తెలుస్తోంది. రాబోయే అమెజాన్ సేల్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్స్ కొనుగోలుపై 40శాతం వరకు డిస్కౌంట్ :
అమెజాన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా అనేక ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు, మరిన్నిఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ స్పష్టం చేసింది. అయితే, ఇందులో స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ల్యాప్‌టాప్ కొనాలనుకునే వినియోగదారులు వివిధ డివైజ్‌లపై రూ.40వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వినియోగదారులు టాబ్లెట్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మిగిలిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో డిస్కౌంట్ పొందే కొన్ని ఫోన్‌ల పేర్లను టీజర్ పేజీ ధృవీకరించింది.

Read Also : Flipkart Big Billion Days Sale : పండుగ సీజన్ ముందుగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు :
OnePlus 11R, Samsung Galaxy S23, iQOO Neo 7 Pro, OnePlus 11, OnePlus Nord 3, Motorola Razr 40 Ultra మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన ఆఫర్లతో లభిస్తాయని (Amazon Sale Page) పేజీ పేర్కొంది. మీరు ఈ డివైజ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేకాదు.. Samsung Galaxy M14, iQOO Z6 Lite, Redmi 12, OnePlus Nord CE 3 Lite, iQOO Z7s వంటి ఇతర ఫోన్‌లు కూడా అమెజాన్‌లో తక్కువ ధరకు అమ్మకానికి వస్తాయి. కచ్చితమైన ధర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అమెజాన్ అతి త్వరలో ఆయా ఫోన్ల ధరల వివరాలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.

Amazon Great Indian Festival Sale Announced iPhone 13 to OnePlus 11R to get discounted

Amazon Great Indian Festival Sale Announced iPhone 13 to OnePlus 11R to get discounted

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఎప్పుడంటే? :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ పేజీలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించింది. ఇందులో Samsung Galaxy S21 FE 5G, ఐఫోన్‌ (iPhones Sale)లు కూడా ఉన్నాయి. ఐఫోన్ డీల్స్ అక్టోబర్ 1న వెల్లడవుతాయని టీజర్ పేజీ ధృవీకరించింది. Samsung, Realme ఫోన్ డీల్స్ వరుసగా అక్టోబర్ 3, అక్టోబర్ 6న లైవ్ కానున్నాయి. అదేవిధంగా, (Redmi) ఫోన్ అభిమానులు అక్టోబర్ 7 వరకు వేచి ఉండాలి. ఒప్పో డీల్స్ అక్టోబర్ 8న అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా అక్టోబర్ 8న (Poco) ఫోన్ డీల్స్ వెల్లడించాలని భావిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు :
Samsung Galaxy F54, iPhone 13, Pixel 7a, Poco X5 Pro, Samsung Galaxy S23 Ultra, Pixel 7 Pro, Samsung Galaxy A34, Redmi Note 12 Pro, Poco F5, Samsung Galaxy A23, Oppo Reno 10, Motorola, Edge వంటి స్మార్ట్‌ఫోన్‌లు Motorola G54, Samsung Galaxy F13 మరెన్నో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది.

Read Also : Amazon Great Freedom Festival : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్.. రూ. వెయ్యి లోపు ధరలో TWS ఇయర్‌ఫోన్లపై టాప్ డీల్స్..!