Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ ఇండియాలోనే..!
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీ ప్లాంట్ మొదలైంది.

Apple Iphone 13 To Be Made In India Now All Details
Apple iPhone 13 Made In India : ప్రపంచ దేశాలకు భారత్ మొబైల్ మార్కెట్ అతిపెద్ద బిజినెస్ మార్కెట్‌గా మారింది. ప్రముఖ పాపులర్ స్మార్ట్ ఫోన్ మేకర్ల దృష్టి అంతా ఇప్పుడు భారత మార్కెట్‌పైనే.. భారత్ వేదికగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా మొబైల్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే.. భారత్ కేంద్రంగా తమ ప్రొడక్టులను తయారుచేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది.
ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే Apple iPhone 13 ట్రయల్ తయారీని ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఫిబ్రవరి నాటికి దేశీయ మార్కెట్ ఎగుమతుల కోసం భారత్‌లో ఐఫోన్ 13 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని ఆపిల్ భావిస్తోంది. ఆపిల్ సెమీకండక్టర్ చిప్‌ల సరఫరాను కూడా ప్రారంభించింది. భారత్‌లో తమ ఉత్పత్తిని పెంచే దిశగా కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్లోబల్ మార్కెట్లలో ఐఫోన్ 13 మోడల్ సరఫరా చేసే దిశగా ఆపిల్‌కి ముందుకెళ్తోంది.
భారతదేశంలో ఉత్పత్తి చేసిన వాటిలో 20 నుంచి 30 శాతం ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై ఆపిల్, ఫాక్స్‌కాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆపిల్ ఐఫోన్ 13 ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించాలని భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. అన్ని ఐఫోన్‌ల సరఫరా చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఐఫోన్ 13 లేటెస్ట్ సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే..
దేశంలో ఆపిల్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ను తయారు చేసేందుకు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఆపిల్ ఇప్పటికే చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 11, ఐఫోన్ 12లను ఉత్పత్తి చేస్తుంది. ఐఫోన్ SE (iPhone SE) బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు. భారత్‌లో ఆపిల్ విక్రయించే దాదాపు 70 శాతం స్మార్ట్‌ఫోన్‌లను దేశంలోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
Read Also : Apple Supplier Plant : భారత్‌లో ఆపిల్ ఫోన్ ప్లాంట్ మూసివేత..