Apple iPhone 14 Sale : రూ. 20వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 14 : పండుగ సీజన్లో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై స్పెషల్ డీల్‌ను అందిస్తుంది. ఈ డివైజ్‌ను రూ. 20వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 14 can be bought under Rs 20,000 on Flipkart
Apple iPhone 14 Sale : మీరు ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ కోల్పోయినవారికి మరో అవకాశం అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. కస్టమర్లు తమ పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 42వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో ఉన్నందున ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రవేశపెట్టినప్పటికీ.. ఐఫోన్ 14 ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఈ డీల్ ఎలా పనిచేస్తుందంటే? :
సాధారణంగా ఐఫోన్ 14 128GB మోడల్‌కు రూ. 69,900 ఖర్చవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 57,999కి విక్రయిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 42వేల వరకు తగ్గింపును అందిస్తుంది. మీరు కేవలం రూ. 15,999లోపు ఐఫోన్ 14ని పొందవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అదనపు 10 శాతం తగ్గింపును అందిస్తాయి. ఈ ఐఫోన్ చివరి ధర రూ. 14,400కు సొంతం చేసుకోవచ్చు. ట్రేడ్-ఇన్ డీల్ 128జీబీ, 512జీబీ వెర్షన్లకు మాత్రమే అని చెప్పవచ్చు. మీరు ఐఫోన్ 14 కొనేందుకు చూస్తుంటే.. ఇదే సరైన సమయం కావచ్చు.

Apple iPhone 14 on Flipkart
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 14 పవర్ ఫుల్ డివైజ్ మాత్రమే కాదు.. మరెన్నో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. స్లిమ్ బెజెల్స్‌తో కూడిన 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. డిస్ప్లే వైడ్ రేంజ్ కలర్లను అందిస్తుంది. హెచ్డీఆర్ కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. అన్నింటికీ 1200-నిట్ ప్రకాశంతో పవర్ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఈ డివైజ్ సురక్షితమైన, సౌకర్యవంతమైన అన్లాకింగ్ కోసం ఫేస్ ఐడీ సెన్సార్లను కూడా కలిగి ఉంటుంది.
హుడ్ కింద, ఐఫోన్ 14 మోడల్ ఎ15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 16-కోర్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU), 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ 128జీబీ, 256జీబీ, 512జీబీతో సహా విభిన్న స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మీ అన్ని ఫైల్లు, యాప్‌లకు తగినంత స్టోరేజీని అందిస్తుంది. లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16పై రన్ అయ్యే ఈ ఐఫోన్ యూజర్-ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.