Apple iPhone 16 : బిగ్ డిస్కౌంట్.. రూ. 79,999 ఖరీదైన ఐఫోన్ 16 జస్ట్ రూ. 59,900కే.. ఈ పాత ఐఫోన్ ఎందుకు బెటర్?
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇప్పటికే ఈ ఐఫోన్ మోడల్ అమ్మకాల్లో టాప్ లిస్టులో ఉంది. అడ్వాన్స్ ఫీచర్లతో ఈ ఐఫోన్ 16 మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు..
Apple iPhone 16
- ఆపిల్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్
- అసలు లాంచ్ ధర రూ.79,900 నుంచి రూ.62,900కి తగ్గింపు
- దాదాపు రూ. 20వేల తగ్గింపుతో ఐఫోన్ 16 కొనేసుకోవచ్చు
- రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యుత్తమ ఐఫోన్లలో ఐఫోన్ 16 ఒకటి. ఈ మోడల్ ఐఫోన్ కన్నా అద్భుతమైన ఫీచర్లతో అనేక ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయినప్పటికీ ఐఫోన్ 16 అమ్మకాల్లో దూసుకుపోతోంది.
ఎందుకంటే.. ఈ ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వస్తుంది. ప్రస్తుతానికి, ఈ ఐఫోన్ మోడల్ విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఐఫోన్ కొనుగోలుపై ఆఫర్లు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ధర తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ విజయ్ సేల్స్‌లో అసలు లాంచ్ ధర రూ.79,900 నుంచి ఏకంగా రూ.62,900కు తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఐసీఐసీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో ధర రూ.59,900కు తగ్గుతుంది. ఈ ఐఫోన్ 16 మొత్తం అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ అనే 5 డిఫరెంట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 60Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఐఫోన్ 16 డిస్‌ప్లే క్వాలిటీ గేమింగ్, స్ట్రీమింగ్‌కు బెస్ట్ ఆప్షన్. హై ఆక్టేన్ పర్ఫార్మెన్స్ అందించే ఆపిల్ A18 బయోనిక్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌తో వస్తుంది. iOS 26పై రన్ అవుతుంది. లిక్విడ్ గ్లాస్ థీమ్, కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఆపిల్ ఐఫోన్ 16 లో 48MP ప్రైమరీ షూటర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు 12MP అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 3561mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. మొత్తం మీద, ఈ ఐఫోన్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్ పొందవచ్చు. దాదాపు రూ. 20వేల తగ్గింపుతో ఐఫోన్ 16 సొంతం చేసుకోవచ్చు.
