Apple iPhone: ఐఫోన్ కొంటున్నారా? ఒక్క నిమిషం.. ఇది తెలుసుకోండి..
ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెస్ట్? అన్న విషయాన్ని తెలుసుకుందాం..

iPhone 16e
గూగుల్ ఇటీవల పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఫీచర్లను ప్రకటించింది. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ఇది అందుబాటులోకి రానుంది. దీని డిజైన్, పనితీరు, కెమెరా సామర్థ్యం విషయంలో ఎన్నో మెరుగులు దిద్ది ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నారు.
మార్చి 19న దీన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే, పలు కారణమాల వల్ల దీన్ని విడుదల ఏప్రిల్‌కి వాయిదా పడింది. ఇది మార్కెట్‌లోకి వచ్చాక దాని ధర, ఫీచర్ల వల్ల ఆపిల్ ఐఫోన్ 16ఈకి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెస్ట్? అన్న విషయాన్ని తెలుసుకుందాం..
Also Read: త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే..
డిజైన్, డిస్‌ప్లే
ఐఫోన్ 16ఈ, పిక్సెల్‌లో డిజైన్‌లు విభిన్నంగానే ఉన్నాయి. ఐఫోన్ 16, పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలోనే డిజైన్లు విభిన్నంగానే కనపడుతున్నాయి. ఈ రెండు ఫోన్‌లు మినిమలిస్ట్ లుక్‌తో ఉన్నాయి. అంటే చాలా సింపుల్ లుక్‌తో వచ్చాయి. పిక్సెల్ 9ఏలో కెమెరా బంప్ లేదు. ఐఫోన్ 16ఈలో ఒక చిన్న కెమెరా బంప్ ఉంది.
ఐఫోన్ 16ఈ కంటే పిక్సెల్ 9ఏపై యూజర్లు అధిక ఆసక్తి చూపేలా దాని డిస్ప్లే సైజు ఉంది. ఆపిల్ ఫోన్ ప్యాక్‌లు 6.1 అంగుళాల OLED స్క్రీన్‌తో వచ్చాయి. 60Hzకి మాత్ర పరిమితం చేసి దీన్ని విడుదల చేశారు. పిక్సెల్ 9ఏ మాత్రం కొంచెం పెద్ద సైజులో వచ్చింది. అంటే 6.3 అంగుళాల 120Hz OLED స్క్రీన్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది.
ఐఫోన్ కంటే స్క్రోలింగ్ స్పీడ్ అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ఐఫోన్ 16ఈ.. పిక్సెల్ కంటే 19 గ్రాములు తేలికగా ఉంటుంది. రెండు ఫోన్‌లూ IP68తో దుమ్ము, దూళి, నీటిని నిరోధించే సామర్థ్యంతో వచ్చాయి. నీటిలో పడినప్పటికీ పాడు కాకుండా బాగానే ఉంటాయి. ఏ18 చిప్‌సెట్‌తో నడిచే ఐఫోన్ 16ఈ బెంచ్‌మార్క్‌ల పరంగా పిక్సెల్ 9ఏ టెన్సార్ జీ4 చిప్‌సెట్ కంటే మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
రెండు ఫోన్‌లు మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే లాగ్ ఫ్రీ పనితీరుతో ఉన్నాయి. ఐఫోన్ 16ఈ iOS 18.3.1తో వచ్చింది. పిక్సెల్ 9ఏ స్టాక్ ఆండ్రాయిడ్ 15తో నడుస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కావాలనుకుంటే, కొత్త గేమ్‌లను కూడా ఆస్వాదించాలనుకుంటే ఐఫోన్ 16ఈ కొనుక్కుంటే బాగుంటుంది.
అలాగే, ఐఫోన్ 16ఈలో ఒకే 48MP కెమెరా ఉంది. ఇది ఇన్-సెన్సార్ జూమ్ ఉపయోగించి 2x ఫోటోలను కూడా తీస్తుంది. పిక్సెల్ 9ఏలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 48MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ షూటర్ ఉంటాయి.