వావ్‌.. ఆరెంజ్‌ కలర్‌లో ఓ రేంజ్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా.. యాపిల్ ఐఫోన్ 17 ప్రోలోని కాస్మిక్ ఆరెంజ్ గుర్తొస్తుందా? 

ఎక్స్‌లో టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ షేర్ చేసిన ఫొటో ప్రకారం.. శాంసంగ్ ఎస్‌26 అల్ట్రా మూడు రంగుల్లో కనిపించింది.

వావ్‌.. ఆరెంజ్‌ కలర్‌లో ఓ రేంజ్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా.. యాపిల్ ఐఫోన్ 17 ప్రోలోని కాస్మిక్ ఆరెంజ్ గుర్తొస్తుందా? 

Updated On : October 8, 2025 / 8:12 PM IST

Samsung Galaxy S26 Ultra: శాంసంగ్‌ ఎస్‌-సిరీస్‌ డివైజ్‌లు ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌లలో చాలా పాపులర్‌ అయ్యాయి. ఫోల్డబుల్ ఫోన్లతో పాటు ఎస్‌25 అల్ట్రా శాంసంగ్‌ టాప్‌-ఎండ్‌ డివైజ్‌గా ఉంది. 2026లో శాంసంగ్‌ ఎస్‌26 సిరీస్‌లో, ముఖ్యంగా అల్ట్రాలో కొన్ని మార్పులను తీసుకురానుంది. కొత్త కలర్ విషయంలో యాపిల్ ఐఫోన్ 17 ప్రో నుంచి ఇన్‌స్పిరేషన్ పొందినట్లు కనిపిస్తోంది.

ఎక్స్‌లో టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ షేర్ చేసిన ఫొటో ప్రకారం.. శాంసంగ్ ఎస్‌26 అల్ట్రా మూడు రంగుల్లో కనిపించింది. వాటిలో మధ్యలో ఉన్న డివైజ్ బ్రైట్‌ ఆరెంజ్‌ షేడ్‌తో ప్రత్యేకంగా నిలిచింది. ఐఫోన్ ఫ్యాన్స్‌ ఈ కలర్ యాపిల్ ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్‌లో ఉన్న కొత్త కాస్మిక్ ఆరెంజ్‌లా ఉందని గుర్తించవచ్చు.

ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్‌లో కాస్మిక్ ఆరెంజ్ కలర్‌కి మంచి స్పందన రావడంతో ఎస్‌26 అల్ట్రాకు కూడా అదే రీతిలో స్పందన వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఐఫోన్లకు ఎక్కువ డిమాండ్‌లో ఉండడంతో కొంతమంది రిటైలర్లు రూ.20,000 అదనంగా వసూలు చేస్తున్నారు.

Also Read: ఇప్పటివరకు ఎవరూ చూడని “విడాకుల వేడుక”.. బ్రేకప్‌ అయితే కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయ్‌..

బ్రైట్ ఆరెంజ్‌ రంగుతో పాటు ఈ ఫొటోల్లో మరికొన్ని రంగులు కనపడ్డాయి. సిల్వర్, టైటానియం కూడా ఉన్నాయి. ఎస్26 అల్ట్రా టైటానియం బాడీని కొనసాగిస్తుందని అంచనా. అయితే యాపిల్ ఈ సంవత్సరం అల్యూమినియంతో వచ్చిన విషయం తెలిసిందే.

శాంసంగ్ S26 అల్ట్రాకు కొత్త డిజైన్
ఎస్‌-అల్ట్రా డివైజ్‌ల డిజైన్లు.. 2022లో వచ్చిన ఎస్‌22 అల్ట్రాను పోలి ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కంపెనీ పెద్ద మార్పునకు సిద్ధమవుతోంది. ఎస్‌26 అల్ట్రాకు ముందుకంటే మరింత రౌండెడ్‌ కార్నర్స్‌ కనిపిస్తున్నాయి. ఇది ఫోన్‌ను పట్టుకోవడంలో మరింత సౌకర్యం ఇస్తుందని భావిస్తున్నారు.

అదనంగా, కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌లో మార్పులు ఉన్నాయి. మూడు లెన్సులు ఒకే మాడ్యూల్‌లో ఉంచగా, మరో రెండు విడివిడిగా ప్రొట్రూషన్లుగా ఉన్నాయి. పక్కన ఫ్లాష్‌ కూడా ఉంది. దీంతో ఎస్‌26 అల్ట్రా గత మోడళ్ల కంటే భిన్నంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్‌26 అల్ట్రా క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో పనిచేస్తుందని అంచనా. ఈ ఫోన్‌లో కొత్త ప్రైవసీ డిస్‌ప్లే స్క్రీన్‌ ఉండొచ్చు.