Viral Video: ఇప్పటివరకు ఎవరూ చూడని “విడాకుల వేడుక”.. బ్రేకప్‌ అయితే కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయ్‌..

నగదు, బంగారం ఇచ్చి భార్యను వదిలించుకున్నానంటూ, ఇకపై సింగిల్.. అంతా హ్యాపీ అంటూ ఆ యువకుడు సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.

Viral Video: ఇప్పటివరకు ఎవరూ చూడని “విడాకుల వేడుక”.. బ్రేకప్‌ అయితే కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయ్‌..

Updated On : October 8, 2025 / 5:54 PM IST

Viral Video: బ్రేకప్‌ అయితే కన్నీళ్లు పెట్టుకుని, డిప్రెషన్‌లోకి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలా మంది. అయితే, అటువంటి రోజులు పోయాయ్‌ అనేలా ఈ మధ్య చాలా మంది బ్రేకప్‌ను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇటీవల ఓ యువకుడికి విడాకులు మంజూరయ్యాయి. భార్యకు రూ.18 లక్షల నగదు, 120 గ్రాముల బంగారాన్ని భరణంగా ఇచ్చాడు. ఇక తాను సింగిల్‌ అంటూ పండుగ చేసుకున్నాడు. హిందూ ఆచారాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. తన తల్లితో క్షీరాభిషేకం చేయించుకున్నాడు. స్నానం చేసి, కొత్త బట్టలు, షూ వేసుకున్నాడు. కేక్ కటింగ్ చేసి ఫుల్ మజా చేశాడు.

Also Read: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా.. “స్థానిక” ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టేకి నిరాకరణ.. వాదనలు ఎలా జరిగాయంటే?

సాధారణంగా విడాకుల తర్వాత చాలా మందికి ఆ బాధ నుంచి బయటపడడానికి కొన్ని నెలల తరబడి సమయం పడుతుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంగా ఉంటూ, తనకు స్వేచ్ఛ దొరికిందంటూ పండుగ జరుపుకున్నాడు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. అది క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఇది ఎవరూ ఇప్పటివరకు చూడని విడాకుల వేడుక అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ వ్యక్తి నేలపై కూర్చుని ఉంటాడు. అతని తల్లి హిందూ సంప్రదాయం ప్రకారం అతనిపై పాలను పోసి “శుద్ధి” కర్మ చేస్తుంది. సాధారణంగా దేవతలకు క్షీరాభిషేకం చేస్తారు. దీన్ని పవిత్ర స్నాన కర్మగా భావిస్తారు. విడాకుల తర్వాత కొత్త జీవితానికి ప్రారంభ సూచకంగా ఈ వ్యక్తి కూడా పాలతో అభిషేకం చేయించుకున్నాడు.