iPhone 15 Precision Finding : ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. 60 మీటర్ల దూరంలోనూ మీ ఫ్రెండ్స్‌ను గుర్తించవచ్చు.. ఇదిగో ఇలా..!

iPhone 15 Precision Finding : ఆపిల్ యూజర్లకు అదిరే వార్త.. ఐఫోన్ 15 సిరీస్‌ (Apple iPhone 15)లో ప్రెసిషన్ ఫైండింగ్ అనే ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూశారా? ఈ కొత్త ఫీచర్ ద్వారా 60 మీటర్ల దూరంలో ఉన్న మీ స్నేహితులను సులభంగా గుర్తించవచ్చు.

iPhone 15 Precision Finding : ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. 60 మీటర్ల దూరంలోనూ మీ ఫ్రెండ్స్‌ను గుర్తించవచ్చు.. ఇదిగో ఇలా..!

Apple now allows iPhone 15 users to find friends within 60 meter, here is how

iPhone 15 Precision Finding : కొత్త ఐఫోన్ 15 సిరీస్ కొనుగోలు చేశారా? ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌ల ఐఫోన్ 15 సిరీస్‌ (iPhone 15 Series)తో కొత్త అప్‌గ్రేడ్‌లు, ఫీచర్లను ప్రవేశపెట్టింది. కొత్త (iPhone 15, iPhone 15 Pro)లోని ఫీచర్ ఎంపిక చేసిన దేశాలు, ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు వెతుకుతున్న స్నేహితుడు ఇద్దరూ ఈ ఫీచర్ ఉపయోగించడానికి తప్పనిసరిగా ఈ డివైజ్‌ల్లో ఒకదాన్ని కలిగి ఉండాలి.

ఫైండ్ మై యాప్ (Find My) యాప్ ద్వారా ప్రెసిషన్ ఫైండింగ్ అనేది ఒకటి. కొత్త రెండో జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఐఫోన్ 15 మోడల్‌లలోని ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు 60 మీటర్ల పరిధిలో స్నేహితులను గుర్తించడంలో సాయపడుతుంది. ఆన్-స్క్రీన్ దిశలు, దూర సమాచారం సాయంతో స్నేహితులను నేరుగా గుర్తించవచ్చు.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 కావాలా? ఈ బ్లింకిట్ స్టోర్‌లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. 10 నిమిషాల్లోనే హోం డెలివరీ.. ఇప్పుడే కొనేసుకోండి..!

Find My App ద్వారా లొకేషన్ షేరింగ్ :
మీ స్నేహితుడు తమ లొకేషన్ మీతో షేర్ చేయడం ద్వారా వారి స్థానాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి (Find My App) ద్వారా కావలసిన స్నేహితుడిని ఎంచుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత, మీ స్నేహితుడి వివరాల కార్డ్‌లో ‘Find’ సమీపంలో బటన్ కనిపిస్తుంది. మీ స్నేహితుని లొకేషన్ దగ్గరగా వెళ్లినప్పుడు, దూరం, దిశాత్మక యారో డైనమిక్‌గా అప్‌డేట్ అవుతుంది. (Precision Finding) యాక్సస్ చేయడానికి (iPhone 15) లేదా (Apple iPhone 15 Pro)తో ఉన్న స్నేహితులు ఫైండ్ మై యాప్ ఉపయోగించి మీతో మాత్రమే వారి లొకేషన్ షేర్ చేయడం చాలా సులభమని ఆపిల్ పేర్కొంది.

ఐఫోన్ 15లో ప్రెసిషన్ ఫైండింగ్ ఎలా వాడాలి? :
* మీ ఐఫోన్ 15లో (Find My) యాప్‌ని ఓపెన్ చేయండి.
* స్క్రీన్ దిగువన, People ఆప్షన్ నొక్కండి. ఆపై మీరు కలవాలనుకుంటున్న స్నేహితుని పేరును ఎంచుకోండి.
* మీ స్నేహితుడు ఇప్పటికే లొకేషన్‌లను షేర్ చేయకుంటే.. మీ లొకేషన్‌ను షేర్ చేయాల్సి రావచ్చు లేదా వారి లొకేషన్‌ను రిక్వెస్ట్ చేయాల్సి రావచ్చు.
* మీ పరిస్థితిని బట్టి, కింది వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి.

iPhone 15 Precision Finding

iPhone 15 Precision Finding with Find My App

* గూగుల్ మ్యాప్స్‌లో మీ స్నేహితుడి లొకేషన్ చూడండి : మీరు సమీపంలో లేకుంటే, వారి లొకేషన్ దగ్గరగా నావిగేట్ చేసేందుకు ప్రయత్నించండి.
* సమీపంలోని మీ స్నేహితుడిని కనుగొనండి : మీరు ఇప్పటికే ఒకరికొకరు సమీపంలో ఉన్నట్లయితే.. వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారని మీ స్నేహితుడికి తెలియజేయడానికి Find నొక్కండి.
* వారి లొకేషన్ కచ్చితమైన దిశలను పొందడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
* మీరు ఒకరికొకరు దగ్గరవుతున్నప్పుడు.. దూరం అంచనాతో పాటు వారి దిశలో ఒక యారో కనిపిస్తుంది.
* మీరు సరైన దిశలో వెళుతున్నప్పుడు, స్క్రీన్ గ్రీన్ కలర్‌గా మారుతుంది.
* మీరు వెతుకుతున్న వ్యక్తిని గుర్తించిన తర్వాత Close బటన్‌ను నొక్కండి.

ఎంపిక చేసిన దేశాల్లోనే ఈ ఐఫోన్ 15 ఫీచర్ అందుబాటులో :
మీ స్నేహితుడు మిమ్మల్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు నోటిఫికేషన్ వస్తే.. మిమ్మల్ని గుర్తించడాన్ని సులభతరం చేసేందుకు మీరు షేర్ చేయడాన్ని నొక్కవచ్చు. మీరు ఇప్పటికే మీ లొకేషన్‌ని వారితో షేర్ చేసి ఉంటే.. వారు మీ లొకేషన్ చూస్తారు. ముఖ్యంగా, అవసరమైతే మీరు ఎప్పుడైనా మీ లొకేషన్ షేరింగ్ చేయడం ఆపివేయవచ్చు.

అన్ని ఐఫోన్ 15 మోడల్స్‌లో ప్రెసిషన్ ఫైండింగ్‌ని ప్రకటించినప్పటికీ యూజర్ల కోసం ప్రెసిషన్ ఫైండింగ్ ఆప్షన్ ఎంపిక చేసిన దేశాలు, ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు వెతుకుతున్న స్నేహితుడు ఇద్దరూ తప్పనిసరిగా ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 15 ప్రో కలిగి ఉండాలి.

ప్రెసిషన్ ఫైండింగ్‌ ఫీచర్ టెస్టింగ్ :
ఒక ట్విట్టర్ (X) యూజర్ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌లో ప్రెసిషన్ ఫైండింగ్‌ను టెస్టింగ్ చేశారు. తద్వారా తమ స్నేహితుడి లొకేషన్ గుర్తించేందుకు ప్రయత్నించారు. రెండవ జనరేషన్ చిప్ U1 చిప్ కన్నా 3 రెట్లు రేంజ్ అందజేస్తుందని ఆపిల్ వాదనకు ఈ డెమో మరింత బలాన్నిచ్చింది. ముఖ్యంగా, ఎయిర్‌ట్యాగ్‌ (Airtags) కోసం ప్రెసిషన్ ఫైండింగ్ ప్రస్తుతం గరిష్టంగా 10-15 మీటర్ల పరిధిని కలిగి ఉంది. 60-మీటర్ల రేంజ్ ఎక్కువగానే ఉంది. ఈ కొత్త జనరేషన్ ఎయిర్‌ట్యాగ్స్ మోడల్‌లు కొత్త అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్‌ను కలిగి ఉంటాయి.

Read Also : Vivo V29 Series Launch : కళ్లు చెదిరే ఫీచర్లతో వివో V29 5G సిరీస్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?