iPhone 15 Plus Series : ఐఫోన్ అంటే ఇట్లుంటది.. USB-C టైప్ ఛార్జింగ్‌తో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

iPhone 15 Plus Series : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15 సిరీస్‌లో మరో 2 వేరియంట్లు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉన్నాయి. USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, డైనమిక్ ఐలాండ్‌, అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి.

iPhone 15 Plus Series : ఐఫోన్ అంటే ఇట్లుంటది.. USB-C టైప్ ఛార్జింగ్‌తో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా..!

Apple unveils iPhone 15, iPhone 15 plus with USB-C type charging

iPhone 15 Plus Series : ప్రపంచ టెక్ దిగ్గజం, ఆపిల్ (Apple) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (iPhone 15), (iPhone 15 Plus)లను USB-C టైప్ ఛార్జింగ్‌తో ప్రవేశపెట్టింది. కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ది వెర్జ్ అనే అమెరికన్ టెక్నాలజీ ఆధారిత వెబ్‌సైట్ ప్రకారం.. ఐఫోన్ 15 అన్ని మోడల్‌లు డైనమిక్ ఐలాండ్‌తో వస్తాయి.

ఐఫోన్ 14 ప్రో, ప్రో మాక్స్‌లో మొదట లాంచ్ అయిన పిల్-ఆకారపు కటౌట్, నిర్దిష్ట నోటిఫికేషన్‌లను చూసేందుకు, యాప్‌లతో కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుంది. ఐఫోన్ 15 OLED సూపర్ రెటినా డిస్‌ప్లేను కూడా కలిగి ఉంది. 1,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డాల్బీ విజన్ కంటెంట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ 15 ప్లస్ డిస్‌ప్లే బ్రైట్‌నెస్ సూర్యకాంతిలో 2,000 నిట్‌లు, ఐఫోన్ 14 కన్నా రెట్టింపుగా కాంతివంతంగా ఉంటుంది.

Read Also : Apple iPhone 15 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయి.. ఈ ఐఫోన్ 15 సిరీస్‌‌లో స్పెషాలిటీ ఇదే.. ఫీచర్లలో తగ్గేదే లే..!

కొత్త ఐఫోన్లలో USB-C, డైనమిక్ ఐలాండ్ ఫీచర్లతో iPhone 15, 15 ప్లస్‌లకు అతిపెద్ద అప్‌గ్రేడ్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. ఈ ఐఫోన్లలోని ప్రధాన కెమెరా సెన్సార్ గత ఐఫోన్ 14లో ఉన్న 12MP నుంచి 48MPకి మారుతోంది. 12MP టెలిఫొటో కూడా ఉంది. పోర్ట్రెయిట్ మోడ్‌ అంటే.. మాన్యువల్‌గా మారాల్సిన అవసరం లేదు. పోర్ట్రెయిట్ మోడ్ కూడా ఉంది.

Apple unveils iPhone 15, iPhone 15 plus with USB-C type charging

iPhone 15 Plus Series : Apple unveils iPhone 15, iPhone 15 plus with USB-C type charging

ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రాగా, ఐఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. iPhone 15 మోడల్ 128GB మోడల్‌కు 799 డాలర్లు (సుమారు. రూ. 67వేలు ) నుంచి ఐఫోన్ 15 ప్లస్ 128GB వెర్షన్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 74వేలు) నుంచి ప్రారంభమవుతుంది.

ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ ఛార్జింగ్ పెడితే.. రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ వాగ్దానం చేస్తోంది. ఎందుకంటే.. ఈ ఐఫోన్లలో పెద్ద బ్యాటరీని కలిగి ఉన్నాయి. iPhone 15 కూడా కొత్త (Apple Watch Series 9) మాదిరిగా సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌ని కలిగి ఉంది. ఇతర డివైజ్‌లకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. (Find My Phone)లో కచ్చితత్వంతో డివైజ్ లొకేషన్ ట్రాక్ చేయగలదు. తద్వారా మీ స్నేహితులను ఎక్కడ ఉన్నారో సులభంగా ట్రాక్ చేయొచ్చు.

Read Also : iPhone 14 Price Cut : ఐఫోన్ 15 ఇలా వచ్చిందంతే.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్ ధరలు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?