ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ 

మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది.

  • Published By: sreehari ,Published On : February 13, 2019 / 10:42 AM IST
ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ 

మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది.

రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టకోస్తోంది. స్మార్ట్ ఫోన్లతో అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఎక్కడ ఉన్నా.. టచ్ చేయకుండానే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ సాయంతో కూర్చొన్న చోట పనులు పూర్తి చేసేస్తున్నారు. మొబైల్ బయోమెట్రిక్ అథంటెకేషన్ ద్వారా Face ID ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ మీ ఫోన్ లో ఉంటే.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టే. అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేయదు. కేవలం.. ఆపిల్ ఐఫోన్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేయనుంది. ప్రస్తుతం ఐఫోన్ లో ఈ ఫేస్ ఐడీ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఆపిల్ కంపెనీ హైటెక్నాలజీ బయో మెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది. 9టూ5మ్యాక్ నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో మీ కారును ఫేస్ ఐడీ ద్వారా ఆన్ లాక్ చేయొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ పై ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. వెహికల్ అథంటికేషన్ కోసం.. సిస్టమ్ అండ్ మెథడ్ తో పనిచేసే ఫేస్ ఐడీ ఫీచర్ ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇదే జరిగితే.. వాహనంలో డ్రైవింగ్ చేసే వ్యక్తి తన వెహికల్ ను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంది. పర్సనలైజ్డ్ మ్యూజిక్, సీటింగ్, క్లైమేట్ కంట్రోల్ వంటి కస్టమైజబుల్ సెట్టింగ్స్ లో ఈ ఫీచర్ లో ఉన్నాయి. దీనిపై రెండేళ్ల క్రితమే (ఫిబ్రవరి 2017లో) ఆపిల్ కంపెనీ పెటేంట్ రైట్స్ దక్కించుకుంది. అయితే ఇప్పటివరకూ ఈ ఫీచర్ డిజైన్ పై వర్కింగ్ చేస్తుందో లేదో ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ఆపిల్ 2018 ఐఫోన్లకు కంటే అతి చౌకైన ధరకే మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను మార్కెట్లలోకి తీసుకొచ్చింది. ఐఫోన్ ఎక్స్ ఆర్ అసలు ధర ఎంతో తెలియలేదు. ముంబై ఆధారిత రిటైలర్ మహేశ్.. ఈ మూడు రకాల ఐఫోన్లను డిస్కౌంట్ ధరకే అమ్ముతున్నాడు. అందులో ఒక్కో ఐఫోన్ 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఉండగా.. ధర మాత్రం.. రూ.70వేల 500, రూ.75,500, రూ.85వేల 900 వరకు ఉన్నాయి. 
 

ఆపిల్ ఐఫోన్ XR స్మార్ట్ ఫోన్.. 2018 సిరీస్ ఐఫోన్లలో ఒకటి. ఐఫోన్ XS, ఐఫోన్ XS Max, ఐఫోన్ XR మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఐఫోన్ XS ప్రారంభ ధర రూ.99వేలు. ఐఫోన్ MAX ధర రూ.1 లక్ష 9వేల 900 నుంచి ఉంది. ఐఫోన్ XR మోడల్ .. 6.1 అంగుళాల LCD డిసిప్లే, 1792X828 ఫిక్సల్ రెజుల్యుషన్ 323 పీపీఐ. A12 బయోనిక్ ప్రాసిసెర్, ఐఓఎస్ 12 అపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.

Also Read: పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..

Also Read: ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు

Also Read: బ్లూవేల్‌కు మించి: ‘టిక్ టాక్’ App బ్యాన్ చేయాల్సిందే