ఫ్లిప్‌కార్ట్‌లో జాక్‌పాట్ డీల్స్.. ఆసస్ OMG డేస్ సేల్

తైవాన్‌కు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఆసస్ తాజాగా కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందించడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆసస్ OMG డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 6న ప్రారంభమై 9 వరకు కొనసాగుతుంది. 2018లో 20 లక్షల మంది కస్టమర్లకు చేరువైన సందర్భంగా కంపెనీ ఈ సేల్ నిర్వహిస్తోంది.
ఆసస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ రూ.8,499 నుంచి అందుబాటులో ఉంది. ఇందులో 5,000(MAH) బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 5.9 అంగుళాల డిస్‌ప్లే వంటి పలు ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్ అనే మూడు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్ ఆసస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఫోన్‌ను రూ.4,999లకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 5.45 అంగుళాల డిస్‌ప్లే, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఎం2 సిరీస్ ఫోన్లను కూడా డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ వీటి ధరలను, డిస్కౌంట్‌లను వెల్లడించలేదు. ఆసస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 ధర రూ.10,000లోపు ఉంది. ఇందులో 4,000 (MAH) బ్యాటరీ ఉంటుంది. ఇక కంపెనీ ఆసస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం2 ఫోన్‌లో 5,000 (MAH) బ్యాటరీని అమర్చింది. చివరగా ఆసస్ జెన్‌ఫోన్ 5జెడ్ ఫోన్ కూడా డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉండనుంది. కంపెనీకి చెందిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో 3,300 (MAH) బ్యాటరీ, 6.2 అంగుళాల డిస్‌ప్లే, 8 జీబీ వరకు ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.