Best Camera Phones : రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Camera Phones : శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Best Camera Phones under Rs 20k
Best Camera Phones : సరసమైన కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, మోటోరోలా, రియల్‌మి ఇతర ప్రముఖ బ్రాండ్ల నుంచి రూ. 20వేల లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఈ స్మార్ట్ఫోన్ల జాబితాలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఎ16 :
శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 13ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఆటో ఫ్లాష్, ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, ఫోకస్ చేసేందుకు టచ్ వంటి అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లతో కూడా వస్తుంది.
మోటో జీ85 :
మరో ఆకర్షణీయమైన కెమెరా స్మార్ట్‌ఫోన్ మోటో జీ85 మోడల్. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలను క్యాప్చర్ చేయడంతో పాటు వీడియో కాల్స్ చేసేందుకు 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.
రియల్‌మి నార్జో 70 టర్బో :
ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరలో పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరాలతో వస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందింది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ సెన్సార్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ :
రూ.20వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 2024 ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. రియల్‌మి నార్జో 70 టర్బో 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది.
హానర్ 200 లైట్ :
హానర్ 200 లైట్ ఫోన్.. ఫ్లాగ్షిప్ హానర్ 200 సిరీస్ సరసమైన వెర్షన్. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
Read Also : Apple iPhone 16 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?