Beware Apple Users : ఆపిల్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఐఫోన్, మ్యాక్‌బుక్ డివైజ్‌లు డేంజర్‌లో.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!
Beware Apple Users : ఆపిల్ ప్రొడక్టులను ప్రభావితం చేసే అనేక దుర్బలత్వాలకు సంబంధించి CERT-In ద్వారా హై-రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఆపిల్ ఐఫోన్ యూజర్లు, మ్యాక్‌బుక్ ప్రొడక్టులను వాడే యూజర్లు తక్షణమే డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోండి.

Beware Apple users _ Your iPhone, Macbook and other products are at high risk, urgent update required
Beware Apple Users : వివిధ ఆపిల్ ప్రొడక్టులను ప్రభావితం చేసే దుర్బలత్వాలకు సంబంధించి CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) ద్వారా హై రిస్క్ సెక్యూరిటీ వార్నింగ్ జారీ చేసింది. హెచ్చరిక ప్రకారం.. ఈ దుర్బలత్వాలు, దుర్వినియోగానికి గురైతే స్కామర్లు సున్నితమైన సమాచారానికి అనధికారిక యాక్సెస్‌ని పొందుతారు. మీ డివైజ్‌లపై కంట్రోల్ కోసం డెనియల్ ఆఫ్ సర్వీసు (DoS) దాడులను కూడా చేసే రిస్క్ లేకపోలేదు. ప్రభుత్వ సంస్థ ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా సూచిస్తుంది.
రిస్క్ ఏంటి? :
CERT-ఇన్ అడ్వైజరీ CIAD-2023-0047 ప్రకారం.. ఆపిల్ ప్రొడక్టుల్లో ఐఫోన్లు, ఐప్యాడ్స్ నుంచి మ్యాక్స్, ఆపిల్ వాచ్‌ల వరకు అనేక భద్రతా లోపాలకు గురవుతాయి. పరిష్కరించకపోతే.. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం, ఆర్బిటరీ కోడ్‌ను అమలు చేయడం, భద్రతా పరిమితులను దాటవేయడం, సేవా నిరాకరణ (DoS) షరతులు, అథెంటికేషన్ వంటి వాటిని స్పూఫింగ్ అటాక్స్ చేసేందుకు హ్యాకర్లు ఈ దుర్బలత్వాలను ఉపయోగించుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే, ఫ్లాగ్ చేసిన దుర్బలత్వాలను జాగ్రత్తగా పరిశీలించకపోతే.. హ్యాకర్లు ఆపిల్ ప్రొడక్టులను తమ అధీనంలోకి తీసుకునేందుకు అనుమతిస్తుంది.
Read Also : Car Insurance Claim : వరదల్లో దెబ్బతిన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు బీమా క్లెయిమ్ ఎలా దాఖలు చేయాలో తెలుసా?
గోప్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు : పాస్‌వర్డ్‌లు, కాంటాక్టులు, ఫొటోలు, ఆర్థిక సమాచారంతో సహా మీ వ్యక్తిగత డేటాకు హ్యాకర్‌లు యాక్సస్ పొందవచ్చు.
మీ డివైజ్‌లను కంట్రోల్ చేయండి : స్కామర్లు మీ డివైజ్ హైజాక్ చేయవచ్చు. మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయవచ్చు. సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
సర్వీసులకు అంతరాయం : మీ డివైజ్‌పై DoS అటాక్స్ ట్రాఫిక్‌తో సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగించవచ్చు.
బైపాస్ సెక్యూరిటీ పరిమితులు : స్కామర్లు భద్రతా పరిమితులను బైపాస్ చేసి అధీనంలోకి తీసుకుంటారు. మీ సిస్టమ్‌కు అనధికార యాక్సస్ పొందవచ్చు.హ్యాకర్లు యాక్సెస్ స్థాయిని పెంచుకోవచ్చు. మీ డివైజ్‌పై పూర్తి కంట్రోల్ పొందవచ్చు.
ప్రభావితమైన ఆపిల్ సాఫ్ట్‌వేర్ :
- ఈ బగ్ కారణంగా ఆపిల్ సాఫ్ట్‌వేర్ విస్తృత శ్రేణిపై ప్రభావం పడుతుంది.
- ఐఓఎస్ : 17.2, 16.7.3కి ముందు వెర్షన్లు
- iPadOS : 17.2, 16.7.3కి ముందు వెర్షన్లు
- macOS : 14.2కి ముందు Sonoma వెర్షన్లు, 13.6.3కి ముందు వెంచురా వెర్షన్‌లు, 12.7.2కి ముందు Monterey వెర్షన్లు
- tvOS : 17.2కి ముందు వెర్షన్లు
- watchOS : 10.2కి ముందు వెర్షన్లు
- సఫారి : 17.2కి ముందు వెర్షన్లు
భద్రత చర్యలివే :
మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని CERT-In యూజర్లను కోరుతోంది. CERT-In సూచించిన కొన్ని అత్యవసర భద్రతా చర్యలు ఈ కింది విధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

Beware Apple users
మీ సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేయండి : ఈ దుర్బలత్వాలను పరిష్కరించడానికి ఆపిల్ సెక్యూరిటీ ప్యాచ్‌లను రిలీజ్ చేసింది. మీ అన్ని ఆపిల్ డివైజ్‌లను (ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్) అందుబాటులో ఉన్న లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకోండి.
క్లిష్టమైన లోపాలను గుర్తించండి : CVE-2023-42916, CVE-2023-42917 వంటి అప్‌డేట్స్ ద్వారా ఐఓఎస్, ఐప్యాడ్ ఆపరేటింగ్ వెర్షన్లను అప్‌డేట్ చేయడంపై దృష్టిపెట్టండి.
ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఎనేబుల్ చేయండి : మీ డివైజ్‌ల్లో ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆన్ చేయండి. అందుబాటులోకి వచ్చిన వెంటనే భవిష్యత్ భద్రతా ప్యాచ్‌లను అప్‌డేట్ చేసుకోవచ్చు. లింక్‌లు, అటాచ్‌మెంట్లతో జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయడం మానుకోండి, ఎందుకంటే.. మాల్వేర్ కోడ్ ద్వారా స్కామర్లు మీ డేటాను దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి.
టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి : మీ అన్ని ఆపిల్ అకౌంట్లలో స్ట్రాంగ్ అండ్ స్పెషల్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయండి. అదనపు భద్రత కోసం టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోండి.