ఆపిల్ ఐఫోన్ 16ప్రో సిరీస్ చూశారా? స్ర్కీన్ పెద్దది.. ధర తక్కువ.. భారత్‌లో ఎంతంటే?

Apple iPhone 16 Pro Price : ఐఫోన్ 16 ప్రో సిరీస్ అంతర్జాతీయ ధరలను ఒకే విధంగా ఉండగా, భారతీయ మార్కెట్‌లో మాత్రం ఈ ఐఫోన్ 16 ధరలను తగ్గించింది.

ఆపిల్ ఐఫోన్ 16ప్రో సిరీస్ చూశారా? స్ర్కీన్ పెద్దది.. ధర తక్కువ.. భారత్‌లో ఎంతంటే?

Apple iPhone 16 Pro series debuts with lower price in India

Apple iPhone 16 Pro Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను గణనీయంగా తగ్గించింది. అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆపిల్ “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా కంపెనీ ఐపోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఫోన్లను భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు భారీ డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక ఏఐ సామర్థ్యాలతో సహా అనేక ఆకర్షణీయమైన అప్‌డేట్స్ ప్రకటించింది.

భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16ప్రో ధర ఎంతంటే? :
ఆపిల్ ఐఫోన్ 16ప్రో (128జీబీ) ఇప్పుడు రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ (256జీబీ) ధర రూ. 1,44,900కు అందిస్తోంది. ఐఫోన్ 15 ప్రో రూ. 1,34,990, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ. 1,56,990కి లాంచ్ అవుతుంది. గత ఏడాదిలో ఐఫోన్ 15ప్రో ధరల కన్నా భారీగా తగ్గింపు అని చెప్పవచ్చు.

Read Also : iPhone 16 Series : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఐఫోన్ 16 సిరీస్ వచ్చేసిందోచ్.. మొత్తం 4 మోడల్స్, ధర, ఫుల్ ఫీచర్లు వివరాలివే..!

ఐఫోన్ 16 ప్రో సిరీస్ అంతర్జాతీయ ధరలను ఒకే విధంగా ఉండగా, భారతీయ మార్కెట్‌లో మాత్రం ఈ ఐఫోన్ 16 ధరలను తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఒకే ధర వద్ద ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్‌తో స్టాండర్డ్ మోడల్ ధర రూ. 79,990, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుంది.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో ప్రత్యేకమైన అప్‌గ్రేడ్‌లలో భారీ డిస్‌ప్లే సైజు ఒకటి. ఐఫోన్ 16 ప్రో ఇప్పుడు 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారీ 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు మోడల్‌లు సన్నగా ఉండే బెజెల్‌లను కలిగి ఉంటాయి. ఐఫోన్‌ 16 సిరీస్ మోడల్స్ వినియోగదారులకు మరింత స్క్రీన్ స్పేస్ అందిస్తాయి.

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో సిరీస్‌లో కెమెరా టెక్నాలజీకి గణనీయమైన అప్‌గ్రేడ్ అందించింది. ఈ రెండు మోడల్‌లు ఇప్పుడు 5ఎక్స్ టెలిఫోటో లెన్స్‌తో వస్తున్నాయి. గతంలో ఐఫోన్ 15 ప్రో మాక్స్‌కు మాత్రమే ప్రత్యేకమైనది. ప్రైమరీ కెమెరా 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో రెండో జనరేషన్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్, యూజర్లు 48ఎంపీ (ProRAW) ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. అదనంగా, ఆపిల్ మెరుగైన మాక్రో షాట్‌లకు 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా ప్రవేశపెట్టింది.

కెపాసిటివ్ బటన్‌ని ఉపయోగించి ఫొటోగ్రఫీ ఫీచర్‌లపై యూజర్లకు మరింత గ్రాన్యులర్ కంట్రోలింగ్ అందిస్తుంది. ఈ ఏడాది చివరిలో కొత్త స్పెషల్ కెమెరా బటన్ అందించనుంది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు రెండూ ఎ18 బయోనిక్ ప్రో చిప్‌తో అమర్చి ఉంటాయి. ఇందులో 3ఎన్ఎమ్ ఆర్కిటెక్చర్ స్పీడ్ పర్ఫార్మెన్స్,ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎ18 ప్రో 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రత్యేకంగా జనరేటివ్ ఏఐ టాస్క్‌లను రన్ చేసేందుకు రూపొందించింది. హై-ఎండ్ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ కోసం 6-కోర్ జీపీయూతో వస్తుంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఆపిల్ కూడా కొత్త “ఆపిల్ ఇంటెలిజెన్స్” ఫీచర్‌లతో ఏఐపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఏఐ టెక్నాలజీతో పాటు సిరి రెస్పాండ్స్, చాట్‌జీపీటీ వంటి టూల్స్‌తో ఇంటర్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఫీచర్‌లు మెసేజింగ్, ఇమెయిల్, ప్రూఫ్ రీడింగ్ వంటి టాస్క్‌లను పూర్తి చేయొచ్చు. తద్వారా మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఈ ఏఐ సామర్థ్యాలలో కొన్ని ఈ ఏడాది తరువాత ఐఓఎస్ 18 బీటాలో అందుబాటులోకి వస్తాయి.

నెలాఖరులో ఐఫోన్ 16ప్రో ప్రీ ఆర్డర్లు :
అంతర్జాతీయంగా ధరలు అలానే ఉంచి భారత మార్కెట్లో ఐఫోన్ 16 ధరలను మాత్రం తగ్గించాలని ఆపిల్ నిర్ణయం తీసుకుంది.కీలకమైన మార్కెట్‌లలో హై-ఎండ్ ఫోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కంపెనీ దృష్టిసారిస్తోంది.

ఐఫోన్ 16 ప్రో, ప్రో మాక్స్ ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీతో వచ్చాయి. ఈ కొత్త ఐఫోన్ల ధర తగ్గుదల భారత మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ ప్రీ-ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ఈ నెలాఖరులో సేల్ ప్రారంభం కానుందని భావిస్తున్నారు.

Read Also : Apple iOS 18 Update : ఐఓఎస్ 18 అప్‌డేట్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు మీకోసం..