Bought New iPhone : కొత్త ఐఫోన్ కొన్నారా? మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ డేటాను ఐఫోన్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Bought New iPhone : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతో ఖరీదైన ఆపిల్ ఐఫోన్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Bought New iPhone : కొత్త ఐఫోన్ కొన్నారా? మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ డేటాను ఐఫోన్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Bought New iPhone, How to transfer WhatsApp data, Android to iOS, Apple Android Data Transfer

Updated On : January 9, 2023 / 6:14 PM IST

Bought New iPhone : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎంతో ఖరీదైన ఆపిల్ ఐఫోన్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఐఫోన్ 13 మోడల్ 2022 ఏడాదిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఐఫోన్ 13 సేల్స్ భారీ పెరిగాయి. మీరు కూడా ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 మోడల్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లతో పోలిస్తే.. ఐఫోన్‌లలో ప్రీమియం ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో iOS మోడల్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు తమ Android నుంచి iOSకి మారుతున్న సమయంలో మైగ్రేషన్ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుంది.

ఆండ్రాయిడ్ నుంచి iOSకి మారే యూజర్లు iPhone 13 లేదా iPhone 14ని కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ ఐఫోన్లను కొనే ముందు యూజర్లు తమ డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. Apple Android నుంచి కొత్త iPhoneకి ఒక ట్యాప్‌తో డేటా మైగ్రేషన్‌ను అనుమతిస్తుంది.

ఐఫోన్ యూజర్లు ఫొటోలు, వీడియోలు, WhatsApp డేటాను కూడా సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీరు Android నుంచి iOSకి ఎలా మారవచ్చు. మీ WhatsAppలో ఇతర డేటాను మీ Android ఫోన్ నుంచి iPhoneకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చో వివరంగా చూద్దాం.

Bought New iPhone, How to transfer WhatsApp data, Android to iOS, Apple Android Data Transfer

Bought New iPhone, How to transfer WhatsApp data, Android to iOS, Apple Android Data Transfer

వాట్సాప్ డేటాను Android నుంచి కొత్త iPhoneకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?
WhatsApp అకౌంట్ డేటా, ప్రొఫైల్ ఫొటో, పర్సనల్ చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, చాట్ హిస్టరీ, మీడియా, సెట్టింగ్‌లను పాత ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. అయితే, యూజర్లు WhatsApp కాల్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయలేరు.

WhatsApp డేటాను Android నుంచి iOSకి డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే? :
* మీరు మీ కొత్త ఐఫోన్‌లో మీ పాత ఫోన్ WhatsApp డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలంటే అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి.
* మీ iPhone తప్పనిసరిగా మెమెరీ క్లీన్ అయి ఉండాలి లేదా ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు Reset చేయాలి. తద్వారా మీరు iOS యాప్‌కి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ Android ఫోన్ నుంచి డేటాను తరలించవచ్చు.
* మీ రెండు డివైజ్‌లు తప్పనిసరిగా పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేయాలని ఉండేలా నిర్ధారించుకోండి. తద్వారా ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ సమయంలో స్విచ్ ఆఫ్ చేయరాదు.
అదనంగా, మీ రెండు డివైజ్‌లు Android కొత్త iPhone ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసి ఉండాలి.

ఇప్పుడు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి డేటా మార్చడానికి :

* మీ Android ఫోన్‌లో Move to iOS యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
* ఇప్పుడు Move to iOS యాప్‌ని ఓపెన్ చేయాలి.. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
* ఇంతలో, మీ iPhoneలో స్టెప్-అప్ ప్రక్రియను కూడా ప్రారంభించండి.
* డేటా ట్రాన్స్‌ఫర్ అడిగినప్పుడు, Android నుంచి Data Transfer ఆప్షన్‌పై Tap చేయండి.
* మీరు మీ ఐఫోన్‌లో కోడ్‌ని పొందవచ్చు. ప్రాంప్ట్ ద్వారా మీ Android ఫోన్‌లో ఆ కోడ్‌ని ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత Continue ఆప్షన్ Tap చేయండి. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
* Transfer ఆప్షన్ నుంచి మీ WhatsApp డేటాతో సహా Transfer చేయాలనుకునే డేటాను ఎంచుకోండి.
* మీ Android ఫోన్‌లో START నొక్కండి. Export కోసం డేటాను రెడీ చేయడానికి WhatsApp కొంత సమయం పడుతుంది. డేటా రెడీ అయిన తర్వాత మీరు మీ Android ఫోన్ నుంచి Sign Out చేయవచ్చు.
* ఆ తర్వాత, Move to iOS యాప్‌కి తిరిగి రావడానికి Next నొక్కండి.
* మీ Android ఫోన్ నుంచి మీ iPhoneకి డేటాను బదిలీ చేసేందుకు Continue బటన్ Tap చేయండి.
* డేటా Transfer పూర్తయినట్లు నిర్ధారించడానికి iOSకి తరలించే వరకు వేచి ఉండండి.
* ఇప్పుడు మీ iPhoneలో యాప్ స్టోర్ నుంచి WhatsApp లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* WhatsApp యాప్‌ని ఓపెన్ చేసి.. అదే ఫోన్ నంబర్‌ని ఉపయోగించి Login చేయండి.
* ప్రాంప్ట్ చేసినప్పుడు Star బటన్‌పై Tap చేయండి. ప్రక్రియను పూర్తి చేసేందుకు అనుమతించండి.
* కొత్త మూవ్ టు iOS యాప్‌ని కూడా టెస్టింగ్ చేయాలి.
* డేటాను కోల్పోయే టెన్షన్ లేకుండా యూజర్లు తమ డేటాను ఈజీగా మైగ్రేట్ చేసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Blocked : మీ వాట్సాప్ బ్లాక్ అయిందా? ఈ Proxy టూల్ ద్వారా ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!