iPhone 16 Pro: అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16ప్రో
ఆఫర్ ఉన్నప్పుడే తక్కువ ధరకు కొనుక్కోండి.

iPhone 16 Pro
ఆపిల్ గత ఏడాది విడుదల చేసిన ఐఫోన్ 16 సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ ఫోన్‌ల ఖరీదు చాలా ఎక్కువగా ఉండడంతో వాటిని కొనడానికి చాలా మంది యూజర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పలు ప్లాట్‌ఫాంలలో భారీ తగ్గింపు ధరలతో ఐఫోన్ 16ప్రో 256 జీబీ వేరియంట్ అందుబాటులో ఉంది.
ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్ 17 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఐఫోన్ 16ప్రో 256 జీబీ వేరియంట్‌పై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ బోనస్‌లు, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉండడం గమనార్హం.
అమెజాన్‌లో ఆఫర్లు..
అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రో 256 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900గా ఉంది. అదనంగా 5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందుకోవచ్చు. అంటే ఈ డిస్కౌంట్‌తో ఆ ఫోన్‌ను రూ.1,22,900కు కొనుక్కోవచ్చు.
అదనపు తగ్గింపు ధరల కోసం..
- పలు బ్యాంక్ కార్డులపై మరో రూ.3,000 తగ్గింపు
- నెలకు రూ.5,537 ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు
- రూ. 53,200 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది
- పూర్తి ఎక్స్‌చేంజ్ విలువ మీకు అందితే ఆ ఫోన్ ధర రూ. 63,000 వరకు తగ్గుతుంది
Also Read: వలసదారులతో భారత్ బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం ల్యాండ్ అయ్యేది ఇక్కడే..!
ఫ్లిప్‌కార్ట్‌లో..
- ఫ్లిప్‌కార్ట్ కూడా క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్‌చేంజ్‌ను అందిస్తోంది
- ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16ప్రో 256జీబీ ధర రూ.1,29,900గా ఉంది
- 5 శాతం డిస్కౌంట్ కూడా ఉంది.. దీంతో ధర రూ.1,22,900కి తగ్గుతుంది
- యాక్సిస్ బ్యాంక్ క్రిడిట్ కార్డుతో మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు
- ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు
- మీ పాత ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూ.41,150 వరకు పొందవచ్చు
ఐఫోన్ 16 ప్రో 256జీబీ ఫీచర్లు
- డిస్‌ప్లే : 6.3-అంగుళాల ఎల్‌టీపీవో సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ప్యానెల్
- ప్రాసెసర్: ఆపిల్ ఏ18 ప్రో చిప్‌సెట్
- బ్యాటరీ: 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3,582ఎంఏహెచ్
- కెమెరాలు: 48ఎంపీ + 12ఎంపీ + 48ఎంపీ ట్రిపుల్ రియర్ సెటప్, 12ఎంపీ సెల్ఫీ కెమెరా
- బిల్డ్: గ్లాస్ బ్యాక్‌తో టైటానియం బాడీ, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్
- స్టోరేజ్: 8జీరా ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వరకు..
Gold Price Hike : బాబోయ్ బంగారం.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంతంటే..?