Viral Video: దీన్ని వేటాడి కడుపునిండా తిందామనుకున్న పులికి.. బావి రూపంలో దురదృష్టం వచ్చి అనుకోని ట్విస్ట్..

అప్పటివరకు వేటాడిన పులి.. చివరకు తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.

Viral Video: దీన్ని వేటాడి కడుపునిండా తిందామనుకున్న పులికి.. బావి రూపంలో దురదృష్టం వచ్చి అనుకోని ట్విస్ట్..

Updated On : February 5, 2025 / 1:08 PM IST

మధ్యప్రదేశ్ సియోని నగరం పెంచ్ నేషనల్ పార్క్‌ సమీపంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని వేటాడి దాని ప్రాణం తీసి తిందామనుకున్న పులికి, చివరకు తన ప్రాణాలను తాను కాపాడుకునే పరిస్థితి వచ్చింది.

ఓ అడవి పందిని పుటి వేటాడుతోంది. పులి వేటాడుతుంటే దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం అనుకోకుండా బావిలో పడింది అడవి పంది. ఊహించని విధంగా పులికూడా బావిలో పడిపోయింది.

అప్పటివరకు శత్రువులుగా ఉన్న ఆ రెండు జంతువులు.. బావి నీటిలో ఉన్న అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చెయ్యడం, ఆ దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. తనదాకా వచ్చేసరికి ప్రాణం విలువ పులికి తెలిసిందని.. ఆపదలో ఉన్నపుడు శత్రువులు కూడా మిత్రులు అవుతారని.. ఇలా ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

బావిలో పడ్డ ఆ రెండు జంతువులను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పులి, అడవి పంది రెండు క్రూర జంతువులూ ఒకే చోట ఉండటంతో వాటిని సేవ్ చేయడం అధికారులకు సవాల్ గా మారింది.

దాదాపు 60 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని, నాలుగు గంటల తర్వాత ఒక మంచం, హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో ఆ రెండు జంతువులను రక్షించామని రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీశ్ కుమార్ సింగ్ మీడియాకు చెప్పారు. పులి, అడవి పందిని తీసుకెళ్లి అడవిలో వదిలేసినట్లు తెలిపారు.