Disney+ Hotstar : డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్.. రూ.49కే మెంబర్‌షిప్!
ప్రముఖ భారత OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొత్త మెంబర్ షిప్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.49 ప్లాన్ అంట.. మెంబర్‌షిప్ తీసుకుంటే నెలరోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు.

Disney+ Hotstar Rs 49 Monthly Plan Brings Live Cricket Stream To Your Mobile
Disney+ Hotstar : ప్రముఖ భారత OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ HotStar) కొత్త మెంబర్ షిప్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.49 ప్లాన్ అంట.. మెంబర్‌షిప్ తీసుకుంటే నెలరోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. మొబైల్ యూజర్లకు ఈ ఆఫర్ అందిస్తోంది హాట్ స్టార్. యూజర్ల అందరి కోసం కాదు.. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట.. మొబైల్ వెర్షన్ హాట్ స్టార్ సబ్ స్ర్కిప్షన్ పొందాలంటే నెలకు రూ.99 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.499 చెల్లించాలి. ఈ ఆఫర్ ద్వారా ప్రీ యాడ్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. హాట్ స్టార్ మెంబర్ షిప్ పొందడం ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా ఫ్రీగా సినిమాలు, షోలు చూడొచ్చు.
హెచ్‌డీ స్ట్రీమింగ్, స్టీరియో ఆడియో క్వాలిటీ ఆఫర్ అందిస్తోంది. మొబైల్ యూజర్ల కోసం రూ.49కే ప్లాన్‌ను అందిస్తోంది. కొందరు యూజర్లకు మాత్రమే ఈ హాట్‌స్టార్ ప్లాన్ అందుబాటులో ఉందని యూజర్.. స్క్రీన్‌షాట్ పోస్టు చేశాడు. అందరి యూజర్లకు ఈ ఆఫర్ అందుబాటులో లేదని, కొంతమంది యూజర్లకు ఆఫర్ కనిపిస్తోంది. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్.. ఇటీవల భారీగా సబ్ స్ర్కిప్షన్ ధరలను తగ్గించడంతో హాట్ స్టార్ కూడా అలర్ట్ అయింది. నెట్ ఫ్లిక్స్ సరికొత్త ఆఫర్లను అందించింది. యూజర్ బేస్ ద్వారా తెలుగు సీరియల్స్, తెలుగు షోలను ఎక్కువగా అప్‌లోడ్ అవుతున్నాయి.
భారత్‌లో నెట్ ఫ్లిక్స్ ప్లాన్ల ధరలను తగ్గించింది. హాట్ స్టార్ యూజర్ల కోసం స్పెషల్ షోలు, మూవీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ నెల వారి సబ్‌స్క్రిప్షన్ ధర రూ.199లను రూ.149 చేసింది. మొబైల్ వ్యూ కోసం మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.499 ప్లాన్ రూ.199, రూ.649 ప్లాన్, రూ.499కి, రూ.799 ప్లాన్, రూ.649కే నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పెంచిన సంగతి తెలిసిందే. రూ.999 ఏడాది మెంబర్‌షిప్‌ను రూ.1499కి పెంచేసింది.
Read Also : Dangerous Apps : మొబైల్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి