వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు : డౌన్ లోడ్ చేసుకోండిలా

వాట్సాప్ లో హోలీ స్టిక్కర్లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు.. ముందుగా మీరు థర్డ్ పార్టీ స్టిక్కర్లు ప్యాకులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • Published By: sreehari ,Published On : March 21, 2019 / 10:30 AM IST
వాట్సాప్‌లో  హోలీ స్టిక్కర్లు : డౌన్ లోడ్ చేసుకోండిలా

Updated On : March 21, 2019 / 10:30 AM IST

వాట్సాప్ లో హోలీ స్టిక్కర్లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు.. ముందుగా మీరు థర్డ్ పార్టీ స్టిక్కర్లు ప్యాకులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా రంగులతో వీధులన్నీ నిండిపోయాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రంగులతో సరదాగా హోలీ కేళీ ఆడుతున్నారు. హోలీ వేడుకలకు సంబంధించి ఫొటోలు, వీడియోలను స్నేహిుతులు, బంధువులకు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో హోలీ పండుగ రోజుంతా రంగురంగులతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. హోళీ పండుగ సందర్భంగా ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ కంపెనీ తమ యూజర్ల కోసం హోలీ స్టిక్కర్లను అందిస్తోంది.
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ
ఈ హోలీ స్టిక్కర్లను మీ స్నేహిుతులకు, బంధువులకు పంపి శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇండియాలో 25 కోట్లు (250 మిలియన్లు) మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. హోలీ సంబురాలకు సంబంధించి ఫొటోలు వీడియోలతో పాటు ఈ హోలీ స్టిక్కర్లను స్నేహితులకు పంపుకోవచ్చు.  

వాట్సాప్ లో హోలీ స్టిక్కర్లను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు.. ముందుగా మీరు థర్డ్ పార్టీ స్టిక్కర్లు ప్యాకులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరో విధంగా కూడా స్టిక్కర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోకి వెళ్లి WAStickerAPP Holi అని టైప్ చేయండి.. లేదా.. WhatsApp stickers for Holi అని టైప్ చేయండి.

ఒకవేళ మీరు వాడే ఫోన్ ఐఫోన్ (ఐఓఎస్) అయితే ఇలానే ఐఓఎస్ ప్లే స్టోర్ లో కూడా సెర్చ్ చేయండి.. వాట్సాప్ థర్డ్ పార్టీ ఫ్రెండ్లీ స్టిక్కర్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్టిక్కర్ల లిస్ట్ లో మీకు కావాల్సిన స్టిక్కర్లు లేకుంటే మాత్రం.. స్ర్కోల్ డౌన్ చేయండి. 

డౌన్ లోడ్ చేయాలంటే.. ఫాలో ది స్టెప్స్ … 
* మీ వాట్సాప్ అకౌంట్ లో లాగిన్ కావాలి. 
* ఎమోజీ ఐకాన్ పై క్లిక్ చేయండి.
* స్టిక్కర్ ఐకాన్ పై మరోసారి క్లిక్ చేయండి
* ఇక్కడ మీకో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది.. 
* నెమ్మదిగా స్క్రోల్ చేయండి.. 
* మీకు కావాల్సిన స్టిక్కర్లను వాట్సాప్ లో యాడ్ చేయండి
* ఇక్కడ.. గెట్ మోర్ స్టిక్కర్స్ అనే అప్షన్ ఉంటుంది. 
* ఈ అప్షన్ పై క్లిక్ చేయగానే నేరుగా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ కు రీడైరెక్ట్ అవుతుంది
* WAStickerApp అని సెర్చ్ బార్ లో టైప్ చేయండి
* కొంచెం స్ర్కోల్ చేసి.. Holi stickers అని టైప్ చేయండి
Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్