Elon Musk : మస్క్ ఏఐ కంపెనీలో హిందీ ట్యూటర్లకు జాబ్స్.. వర్క్ ఫ్రమ్ హోమ్.. గంటకు వేతనం ఎంతో తెలుసా..

లింక్డ్ ఇన్ లో ఇచ్చిన ఉద్యోగ వివరణ ప్రకారం.. ఈ ఉద్యోగానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. మీకు హిందీపై మంచి పట్టు..

Elon Musk : మస్క్ ఏఐ కంపెనీలో హిందీ ట్యూటర్లకు జాబ్స్.. వర్క్ ఫ్రమ్ హోమ్.. గంటకు వేతనం ఎంతో తెలుసా..

Elon Musk

Updated On : October 31, 2024 / 11:12 AM IST

Elon Musk అపర కుబేరుడు, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ అందరికీ సుపరిచితమే. మస్క్ కు సంబంధించిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) ఇప్పుడు హిందీ ట్యూటర్ల కోసం వెతుకుతోంది. అర్హులైన వారిని తమ కంపెనీలో ఏఐ ట్యూటర్లుగా నియమించుకోనుంది. ఈ ఉద్యోగం కోసం మీరు కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు.. ఇంటి నుంచే వర్క్ చేయొచ్చు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ గంట చొప్పున వేతనం అందజేసింది. ప్రతి గంటకు రూ. 2,900 నుంచి రూ. 5,500 వరకు వేతనం అందజేస్తుంది. హిందీ భాషపై పట్టుఉన్నవారు ఇంగ్లీష్ వచ్చిన వారు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Moto G Series Launch : త్వరలో మోటోరోలా నుంచి మోటో 2 కొత్త సిరీస్ ఫోన్లు.. లాంచ్‌టైమ్ లైన్ వివరాలివే..!

లింక్డ్ ఇన్ లో ఇచ్చిన ఉద్యోగ వివరణ ప్రకారం.. ఈ ఉద్యోగానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. మీకు హిందీపై మంచి పట్టు, పరిశోధన నైపుణ్యాలు, హిందీలో జర్నలిజం లేదా కంటెంట్ రైటింగ్ లో అనుభవం ఉండాలి. టెక్నికల్ పదాలను ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించే నైపుణ్యం ఉండాలి. హిందీతోపాటు ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, స్పానిష్ మాట్లాడే వారికి కూడా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఉద్యోగంలో చేరిన వారు ఏం చేయాలనే విషయంపైనా కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ ఏఐ కంపెనీ డెవలప్ చేసే ఏఐ మోడల్ కు హిందీ భాషలో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. హిందీలో నిత్యం వినియోగించే అన్ని రకాల వేలాది పదాలను ఏఐ మోడల్ కు నేర్పాలి. ఆయా పదాలను టైప్ చేసినా.. వాయిస్ లో చెప్పినా గుర్తు పట్టేలా ఏఐ మోడల్ ను సంసిద్ధం చేయాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనివేళలు ఉంటాయి.

 

ఎలాన్ మస్క్ 2023 జూలై నెలలో ఎక్స్ ఏఐ పేరుతో కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీని నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. ఎక్స్ ఏఐ అనేది ఎలాన్ మస్క్ ఏఐ చాట్ బాట్. ఇది పూర్తిగా చాట్ జీపీటీ, గూగుల్ జెమినిలా పనిచేస్తుంది. దీనికితోడు దేనికైనా సమాధానం వేగంగా దొరుకుతుంది.