Facebook New Feature : ఫేస్‌బుక్‌లో కొత్త Feeds ట్యాబ్ ఫీచర్.. పోస్టులను ఇక ఆర్డర్‌లో చూడొచ్చు!
ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ వస్తోంది. ఇప్పటివరకూ అందించిన ఫీచర్ల కన్నా భిన్నమైన ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. Feeds Tab ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకు నచ్చిన న్యూస్ ఫీడ్ కంటెంట్ కాలక్రమానుసారం చూడవచ్చు.

Facebook News Feed Tab Finally Lets Users View Posts In Chronological Order (1)
Facebook New Feature : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ వస్తోంది. ఇప్పటివరకూ అందించిన ఫీచర్ల కన్నా భిన్నమైన ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. Feeds Tab ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకు నచ్చిన న్యూస్ ఫీడ్ కంటెంట్ కాలక్రమానుసారం చూడవచ్చు. Android యూజర్లు మాత్రమే కాదు.. iOS యూజర్లకు Facebook యాప్‌లో మెయిన్ హోమ్ ట్యాబ్ ‘Feeds’ అనే కొత్త ట్యాబ్ యాడ్ కానుంది. మీ Facebookలో కనెక్ట్ అయిన వ్యక్తులు, కమ్యూనిటీల నుంచి కంటెంట్‌కి సులభమైన యాక్సెస్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ అందించే హోమ్ ట్యాబ్ ఇప్పటికీ మీ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా కంటెంట్, సూచించిన పోస్ట్‌లను వీక్షించేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ భారత్‌లో అందుబాటులో లేదు. రాబోయే రోజుల్లో లేదా వారాల్లో వచ్చే అవకాశం ఉంది. Facebook ఫీడ్‌లలో ‘Suggested For You’ పోస్ట్‌లు లేనట్టుగా కనిపిస్తోంది.

Facebook News Feed Tab Finally Lets Users View Posts In Chronological Order
అయితే యాడ్స్ మాత్రం కనిపిస్తున్నాయని ఓ బ్లాగ్ పోస్టు తెలిపింది. ఐఫోన్ కలిగిన ఫేస్‌బుక్ యూజర్లు ఈ Feeds ట్యాబ్‌ను దిగువన చూస్తారు. ఆండ్రాయిడ్ యూజర్లు టాప్‌లో చూస్తారు. ఇక Feeds సెక్షన్.. Favourites, Friends, Groups, Pages వంటి సబ్ సెక్షన్లను కలిగి ఉంటుంది. ఈ ఫీడ్ కేటగిరీల ఆధారంగా డిస్‌ప్లే అవుతుంది. ఫీడ్‌ల విభాగం Instagram ఫాలోయింగ్, ఫేవరెట్ ట్యాబ్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. యూజర్లు తమ పోస్ట్‌లను కాలక్రమానుసారంగా చూసేందుకు ఈ కొత్త ఫీచర్ అనుమతిస్తుంది. ప్రధాన ట్యాబ్ డిస్కవరీ ఇంజిన్ ఆధారంగా పోస్ట్‌లను చూపిస్తుంది. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా కంటెంట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. మీరు ఎక్కువగా వినియోగించిన యాప్‌లోని సెక్షన్ల ఆధారంగా షార్ట్‌కట్ బార్‌లోని ట్యాబ్స్ మారుతాయి. మీ షార్ట్‌కట్ బార్‌లో ట్యాబ్‌ను కేటగరైజ్ చేయొచ్చు. లేదంటే పిన్ చేయవచ్చు.
ప్లేస్‌మెంట్ పర్మినెంట్‌గా ఉంటుందని తెలిపింది. ఫీడ్‌ల విభాగాన్ని సూచించే సెక్షన్లపై క్లారిటీ లేదు. వినియోగదారులకు మంచి కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో Facebook సంవత్సరాలుగా అల్గారిథమ్‌ను మెరుగుపరుస్తోంది. గత నెలలో, ఫేస్‌బుక్ పోటీదారు అయిన టిక్‌టాక్‌కు పోటీగా ప్రత్యర్థిగా కొత్త అప్‌డేట్‌లపై పనిచేస్తోందని లీక్ మెమో సూచించింది. TikTok “For You” ఫీడ్ మాదిరిగానే మరింత పర్సనలైజడ్ షార్ట్ వీడియో సిఫార్సులను అందించేందుకు ప్లాట్‌ఫారమ్ Discovery Engineను కలిగి ఉంటుందని పేర్కొంది.
Read Also : SBI Users : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు!