Fact Check: వాట్సప్ కొత్త రూల్ నిజమేనా? రెడ్ టిక్ వస్తే అరెస్ట్ చేస్తారా?

వాట్సాప్‌లో ఫేక్ మెసేజెస్ వైరల్ అవడం కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఎర వేస్తూ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.

Fact Check: వాట్సప్ కొత్త రూల్ నిజమేనా? రెడ్ టిక్ వస్తే అరెస్ట్ చేస్తారా?

Fact Check

Updated On : May 28, 2021 / 12:46 PM IST

WhatsApp Red Tick: వాట్సాప్‌లో ఫేక్ మెసేజెస్ వైరల్ అవడం కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ వైరల్ అవుతూ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఎర వేస్తూ మోసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. ప్రైవసీకి సంబంధించి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకుని రాగా.. ఈ సమయంలోనే వాట్సప్ రెడ్ టిక్ అంటూ ఓ మెసేజ్ వైరల్‌గా మారింది. ఈ మేసేజ్‌పై ఇప్పుడు ప్రభుత్వం వాట్సప్ వినియోగదారులను హెచ్చరిస్తుంది.

పిఐబి ఫాక్ట్ చెక్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చింది. “రేపటి నుంచి వాట్సాప్‌ కొత్త కమ్యూనికేషన్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అన్ని కాల్స్‌ రికార్డు చేస్తారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా అన్ని సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంటుంది. ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే జైలుకే.. అరెస్ట్ అవుతారు.

వాట్సాప్‌ మెసేజ్‌లకు సంబంధించి కొత్త ఫీచర్‌ అమల్లోకి వచ్చింది. మూడు బ్లూ టిక్‌లు పడితే ప్రభుత్వం దృష్టికి మీ మెసేజ్‌ చేరినట్టు అర్థం. రెండు బ్లూ కలర్ టిక్‌లు, ఒక ఎరుపు రంగు టిక్‌ పడితే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకుంటుందని.. ఒక నీలి, రెండు ఎరుపు రంగు టిక్‌లు పడితే ప్రభుత్వం మీ మెసేజ్‌ను పరిశీలిస్తోందని అర్థం. ఇక మూడూ రెడ్‌ టిక్‌లు పడితే ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్‌ ప్రారంభించిందని, త్వరలోనే నోటీసులు జారీ అవుతాయి” అనేది ఆ మెసేజ్ సారాంశం.

ఈ మెసేజ్‌కు సంబంధించి లేటెస్ట్‌గా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, మీ సందేశాలను, కాల్స్‌ను ప్రభుత్వం రికార్డు చేయదని స్పష్టం చేసింది. వాట్సాప్‌ కొత్తగా ఎలాంటి కమ్యూనికేషన్స్‌ నిబంధనలను అమలుచేయలేదని, మూడు రెడ్‌ లేదా బ్లూ టిక్‌ ఫీచర్‌ కూడా ఎక్కడా లేదని, ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజెస్ కాబట్టి వాట్సప్ మెసేజెస్‌ని చూడడానికి ఎవరికీ వీలు కాదని వెల్లడించింది.